Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఆ ధైర్యం మనలో ఉండాలి

shankar

కమేడియన్‌గా మంచి స్థాయిలో ఉంటూనే హీరోగా ‘శంభో శంకర’ చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు షకలక శంకర్. శ్రీధర్.ఎన్ దర్శకుడిగా పరిచయం చేస్తూ రమణారెడ్డి, సురేష్ కొండేడి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో శంకర్ చెప్పిన సినిమా విశేషాలు…
అందుకే హీరోనయ్యా…
కమేడియన్‌గా నా స్థాయికి తగిన, మా నాన్నను సంతృప్తిపరచగల పాత్రలు రావడం లేదు. అందుకే హీరో అయ్యాను. అంతేకానీ ఏదో ఉద్దరించేద్దామనే ఉద్దేశ్యంతో కాదు.
వాళ్లు ముందుకు రాలేదు…
ఈ కథతో త్రివిక్రమ్, దిల్‌రాజు వద్దకు వెళ్లాను. ఎందుకంటే కొంత డబ్బు పెడితే పది మంది బ్రతుకుతారనే ఉద్దేశ్యంతో వాళ్ల వద్దకు వెళ్లాను. వాళ్లు ప్రోత్సహించారు కానీ సినిమాను నిర్మించడానికి ముందుకు రాలేదు.
ఆర్జీవి వద్దకు వెళ్లలేకపోయా…
ఈ సినిమా కోసం మా గురువు ఆర్జీవి వద్దకు వెళ్లలేకపోయాను. ఆయనే హిట్ కొట్టలేకపోతున్నారు. ఆయనొక హిట్ కొట్టాలని నేను కూడా కోరుకుంటున్నాను.
ఒకరకంగా అసిస్టెంట్ డైరెక్టర్‌ని…
ఈ కథను మొదటి నుంచి నేను, దర్శకుడు శ్రీధర్ కలిసి తయారుచేసుకున్నాం. అంటే కథ దర్శకుడిదే అయినప్పటికీ ఇద్దరం కలిసి డెవలప్ చేశాం. ఒక రకంగా నేను ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ అనుకోవచ్చు.
నా భవిష్యత్తు తెలిసిపోదు…
ఈ ఒక్క సినిమాతో హీరోగా నా భవిష్యత్తు తెలిసిపోదు. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే భవిష్యత్తు ఉండదు అనుకుంటే ఈరోజు చాలా మంది హీరోలు ఉండరు. ఫ్లాప్ వచ్చినా నిలబడగల ధైర్యం మనలో ఉండాలి.

Comments

comments