Search
Friday 21 September 2018
  • :
  • :

కళ్లతోనే హావభావాలను పలికించింది

తొలిప్రేమ, డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా వంటి సూపర్‌డూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించి లవ్‌స్టోరీస్ స్పెషలిస్ట్‌గా పాపులారిటీ తెచ్చుకున్న దర్శకుడు ఎ.కరుణాకరన్. తాజాగా ఆయన సాయిధరమ్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా ‘తేజ్’ ఐ లవ్ యు చిత్రానికి దర్శకత్వం వహిం చారు. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై హిట్ టాక్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా ఎ.కరుణాకరన్‌తో ఇంటర్వూ విశేషాలు…

karunakar

సినిమా చాలా బాగుందని అంటున్నారు…
సినిమాకు చాలా మంచి స్పందన వస్తోంది. ఇంతకుముందు నేను చేసిన లవ్‌స్టోరీస్‌లో కంటే ఇదొక డిఫరెంట్ స్క్రీన్‌ప్లే ఉన్న చిత్రం.స్నేహితులు, బంధువులు ప్రతి ఒక్కరూ ఫోన్‌లు చేస్తూ సినిమా చాలా బాగుందని అంటున్నారు. సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం.
అద్భుతంగా నటించాడు…
ఈ చిత్రంలో సాయిధరమ్‌తేజ్ అద్భుతంగా నటించాడు. డ్యాన్స్‌లు, ఫైట్స్ అన్నీ ఎక్స్‌ట్రార్డినరీగా చేశాడు. ప్రేక్షకులు సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు.
అంతే అద్భుతంగా…
కొత్త పెయింటింగ్ వేసినప్పుడు ఫ్రెష్‌గా ఎంత అద్భుతంగా ఉంటుందో అనుపమ పరమేశ్వరన్ పర్‌ఫార్మెన్స్ అంతే అద్భుతంగా ఉంది. తన క్యారెక్టర్‌లో ఆమె జీవించేసింది. తన కళ్లతోనే హావభావాలను పలికించి ప్రేక్షకులను మైమరపించింది.
మ్యూజిక్ హైలైట్‌గా….
గోపీసుందర్ జీనియస్ మ్యూజిక్ డైరెక్టర్. అడిగా అడిగా…, అందమైన చందమామ… పాటలు పెద్ద హిట్ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఎంతో బాగుంది. సినిమాలోని హైలైట్‌లలో మ్యూజిక్ ఒకటిగా నిలిచింది.
సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నా…
నా దగ్గర చాలా కథలు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ‘తేజ్’ ఐ లవ్ యు సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ సినిమా గురించి ఆలోచిస్తాను.

Comments

comments