Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

మంచి కథలతోనే చేశా

గోపీచంద్ హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘పంతం’. గోపీచంద్ నటించిన ఈ 25వ చిత్రంతో కె.చక్రవర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా గురువారం విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో గోపీచంద్‌తో ఇంటర్వూ విశేషాలు..

gopi

 అద్భుతంగా తెరకెక్కించాడు…
దర్శకుడు చక్రి నాకు కథ చెప్పిన తర్వాత ‘ను వ్వు కథ బాగా చెప్పావు… అంత బాగా తీయగలవా?’ అని అడిగాను. అతను నవ్వు తూ ‘మీరు నాకు అవకాశం ఇస్తే సినిమా చేసి చూపిస్తాను’ అని అన్నాడు. చక్రి ఆరోజు కథ ను ఎలాగైతే చెప్పాడో అదేవిధంగా సినిమాను కూడా అద్భుతంగా తెరకెక్కించాడు. దీనికి ప్రసాద్ మూరెళ్ల అనుభవం కూడా తోడయింది. చక్రి, ప్రసాద్ చర్చించుకొని ఈ సినిమా చేశారు.
 మాటపై నిలబడే జెంటిల్‌మెన్…
నిర్మాత కె.కె.రాధామోహన్‌ను శ్రీధర్ పరిచయం చేశారు. చక్రి కొత్త దర్శకుడు కదా ఎలా తీస్తాడోనని ఆయన ఆలోచించారు. ‘కథ వినండి… మీకు నచ్చితే ముందుకు వెళదాం’ అని అన్నాను. ఆయనకు కూడా కథ నచ్చడంతో ఓ బడ్జెట్ అనుకొని సినిమాను పూర్తి చేశాం. సినిమా పూర్తయిన తర్వాత నిర్మాత కూడా హ్యాపీగా ఉన్నారు. ఇక రాధామోహన్ మాటపై నిలబడే జెంటిల్‌మెన్.
 పవర్‌ఫుల్ డైలాగ్స్…
సినిమాలో నేను అందరూ బావుండాలనే పా త్రలో నటించాను. తన చుట్టూ ఉన్న ఓ సమస్యను రూపుమాపడానికి ప్రయత్నం చేసే హీ రోగా కనిపిస్తాను. ఈ సినిమాకు రమేశ్‌రెడ్డి, శ్రీకాంత్ డైలాగ్స్ రాశారు. ఇక నేను డైలాగ్స్ తో కలిసి స్టోరీ వినడం జరిగింది. సెకండాఫ్ లో పవర్‌ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. టీజర్, ట్రై లర్‌లో డైలాగ్స్ పవర్ ఏంటో తెలిసిపోయింది. అలాంటి డైలాగ్స్ సినిమాలో చాలా ఉన్నాయి.
 అన్నింటికీ టెన్షన్ పడ్డా…
నేను చేసిన 25 సినిమాల కథలు మంచివే. జయాపజయాలు పక్కన పెడితే మంచి కథలతోనే ఈ సినిమా లు చేశాను. సరిగ్గా తెరకెక్కించకపోవడం వల్ల కొన్ని సినిమాలు సక్సెస్ కాలేకపోవచ్చు. అయితే ప్రతి సినిమా విడుదల సమయంలో టెన్షన్ పడ్డాను.
 తదుపరి చిత్రాలు..
ప్రస్తుతం బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాణంలో కుమార్ అనే డైరెక్టర్‌తో ఓ సినిమా చేస్తున్నాను. క్లీన్ లవ్‌స్టోరీ ఇది. సంపత్‌నందితో ఓ సినిమా చేస్తాను. ఈ సినిమాకు సంబంధించి కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే దీని వివరాలు తెలియజేస్తాను.

Comments

comments