Search
Wednesday 21 November 2018
  • :
  • :

ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నామా అనిపించింది

vishal

విశాల్ కథానాయకుడిగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన ‘ఇరుంబుతెరై’ ఇటీవల విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని ‘అభిమన్యుడు’ పేరుతో ఎం.పురుషోత్తమన్ సమర్పణలో వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి తెలుగులో విడుదల చేస్తున్నారు. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం జూన్ 1వ తేదీన విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో విశాల్‌తో ఇంటర్వూ
సామాజిక సందేశంతో కూడిన…
తమిళంలో ‘ఇరుంబు తెరై’ చిత్రం మే 11న విడుదలై నా కెరీర్‌లో పెద్ద విజయంగా నిలిచింది. తెలుగులో ఈ సినిమా ‘అభిమన్యుడు’ పేరుతో జూన్ 1న రానుంది. తెలుగులో కూడా అలాంటి స్పందనే వస్తుందని అనుకుంటున్నాను. ఇదొక మంచి సామాజిక సందేశంతో కూడిన కమర్షియల్ సినిమా.
అందుకు సిద్ధంగా ఉన్నామా, లేదా..

ఈ సినిమాలో ఆధార్ కార్డు, డిజిటల్ ఇండియా వంటి వాటి వలన ఎలాంటి నష్టాలున్నాయి, వాటి మూలంగా ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో స్పష్టంగా చెప్పాము. డిజిటల్ ఇండియా తప్పని సినిమాలో చెప్పలేదు. దానికి మనం సిద్ధంగా ఉన్నామా, లేదా అనే ప్రశ్నను సంధించాం.
అనుభవం ఉన్న దర్శకుడిలా…

దర్శకుడు మిత్రన్ మూడేళ్ల క్రితమే నాకు ఈ కథ చెప్పాడు. కొత్త దర్శకుడు అయినప్పటికీ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. అనుభవం ఉన్న డైరెక్టర్‌లా సినిమాను రూపొందించాడు. ప్రజలకు తెలియని చాలా విషయాల్ని ఇందులో ప్రస్తావించాం.
ఆతర్వాత ఫేస్‌బుక్ వాడలేదు…

ఈ కథ వినగానే షాకయ్యాను. ఆతర్వాత స్మార్ట్ ఫోన్ వాడాలన్నా భయమేసింది. కథ విన్నప్పటి నుంచి ఫేస్‌బుక్ కూడా వాడలేదు. నిజంగా ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నామా అనిపించింది.
హ్యాకర్‌గా అర్జున్…

సినిమాలో అర్జున్ చాలా గొప్పగా నటించారు. ఆయన పాత్ర పేరు వైట్ డెవిల్. ఒక హ్యాకర్. అందరి సమాచారాన్ని దొంగిలించి నేరాలు చేస్తుంటారు.
చాలా వేగంగా ప్రజల్లోకి…

నాకు సామాజిక బాధ్యత ఉంది. అందుకే సినిమా మాధ్యమం ద్వా రా అందరికీ ఉపయోగపడే విషయాలను చెప్పాలనుకుంటున్నాను. సినిమాల ద్వారా చెప్పే విషయాలు చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్తాయి. నా నెక్స్ సినిమాల్లో కూడా ఇలాంటి సందేశాలు ఉంటాయి.
కొత్త ముగింపునిస్తాం…

‘టెంపర్’ రీమేక్ షూటింగ్‌ను వీలైనంత తొందరగా మొదలు పెట్టాలనుకుంటున్నాము. చిన్న పిల్లలపై జరిగే అరాచకాలు, దేశంలో జరిగే అత్యాచారాలకు మరణ శిక్ష పడాలనేది అందులోని ప్రధాన అంశం. తెలుగు వర్షన్‌లో ఉండే ముగింపు కాకుండా కొత్త ముగింపును ఇవ్వాలనుకుంటున్నాం. మురుగదాస్ దగ్గర కో డైరెక్టర్‌గా పనిచేసిన యువకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.

Comments

comments