Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

మంచి కథలతోనే విజయాలు

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ అధినేత కె.ఎస్.రామారావు నిర్మాతగా ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను రూపొందించారు. అభిలాష, రాక్షసుడు, ఛాలెంజ్, మాతృదేవోభవ, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి పలు హిట్ చిత్రాలను నిర్మించి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు. తాజాగా సాయిధరమ్‌తేజ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు నిర్మించిన ప్రేమ కథా చిత్రం ‘తేజ్’. ఐ లవ్ యు అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం జూలై 6న ప్రపంచవ్యాప్తంగా  విడుదలకానుంది. ఈ సందర్భంగా కె.ఎస్.రామారావుతో ఇంటర్వూ విశేషాలు… 

ks-ramarao

45వ చిత్రం…

క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌లో వస్తున్న 45వ చిత్రం ‘తేజ్’. మంచి ఫీల్, ఎమోషన్స్ ఉన్న క్లీన్ మూవీ ఇది. గోపి సుందర్ మ్యూజిక్, కరుణాకరన్ దర్శకత్వ ప్రతిభతో వస్తున్న అందమైన చిత్రమిది. డార్లింగ్ స్వామి చక్కటి డైలాగ్స్ అందించారు. సాయిధరమ్‌తేజ్‌కు ఈ చిత్రం మంచి పేరును తెచ్చిపెడుతుంది.
క్యూట్ లవర్స్‌గా…

సినిమాలో కరుణాకరన్ స్టైల్‌లో పాటలుంటాయి. లవ్ స్టోరీ కనుక రొమాంటిక్‌గా అనిపిస్తాయి. తేజు, అనుపమ తెరపై క్యూట్ లవర్స్‌గా కనిపిస్తారు.
అందుకే ఆ టైటిల్…

తేజ్ హీరో పేరు. ఇక హీరో, హీరోయిన్‌ల ప్రేమ ప్రయాణంలో చివరకు హీరోయిన్ హీరోకు తన ప్రేమను తెలియజేస్తూ… తేజ్ ఐ లవ్ యు అని చెబుతుంది. అందుకే సినిమాకు ఆ టైటిల్ పెట్టడం జరిగింది.
అది అలవాటైంది…

నేను ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చాను కనుక మొదటి నుంచి కథలు వినడం, చదవడం, వాటి గురించి ఆలోచిం చడం అలవాటైంది. మం చి కథలతో సినిమాలను నిర్మిం చాను కాబట్టి విజయాలు వచ్చాయి.
కొత్త, పాత అనేది ఉండదు...

మంచి సినిమాలు చేస్తే ఎవరైనా పెద్ద నిర్మాతగా నిలబడతారు. రంగస్థలం, బాహుబలి సినిమాలు నిర్మించింది కొత్త బ్యానర్‌లే కదా. ఆ సినిమాలు బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచాయి. సినిమాకు కొత్త, పాత అనేది ఏమీ ఉండదు. మంచి కంటెంట్‌తో సినిమాలు చేస్తే నిర్మాతగా ఎవరైనా నిలబడతారు.
ఎంతో ప్రొఫెషనల్…

ఈ తరం నటీనటులు ఎంతో ప్రొఫెషనల్‌గా ఉంటున్నారు. నాని, విజయ్ దేవరకొండ, వరుణ్‌తేజ్ వంటి చాలా మంది హీరోలు ముందుచూపుతో సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే వారు సక్సెస్ అవుతున్నారు.
నెక్ట్ సినిమా...

త్వరలో విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో ఓ సినిమాను ప్లాన్ చేశాము. అక్టోబర్‌లో తొలి షెడ్యూల్ ఉంటుంది. ఈ సినిమాకు హీరోయిన్‌ను ఇంకా ఫైనల్ చేయలేదు.

Comments

comments