Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

నా భార్య మెచ్చుకుంది

nandu

నందు, సౌమ్య వేణుగోపాల్, పూజ రామచంద్రన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. హరహర చలన చిత్ర సమర్పణలో వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో  ఎస్.శ్రీకాంత్ రెడ్డి, రామమోహన రావు ఇప్పిలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 6న ఈ సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో నందు మాట్లాడుతూ చెప్పిన సినిమా విశేషాలు… 

కొత్తదనం కనిపిస్తుంది… మంచి లవ్‌స్టోరీ ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. కష్టాల్లో ఉన్న తన కుటుంబాన్ని హీరో ఎలా కాపాడుకున్నాడు అనే విషయాన్ని దర్శకుడు వైవిధ్యంగా చూపించాడు. హీరో క్యారెక్టరైజేషన్‌లో కొత్తదనం కనిపిస్తుంది.
ఆమె పాత్రే మెయిన్ ట్విస్ట్... హీరోయిన్ పూజా రామచంద్రన్ పాత్ర చాలా బాగా వచ్చింది. సినిమాలో ఒక మెయిన్ ట్విస్ట్ ఆమె పాత్రనే. ఉంగరాల జుట్టుతో ఆకర్షణీయంగా ఉంటుందని ఆమెను తీసుకున్నాం. ఇక సౌమ్య వేణుగోపాల్ ‘కాటమరాయుడు’ తర్వాత చేస్తున్న సినిమా ఇది. ఆమె పాత్ర కూడా బాగుంటుంది.
ఇలాంటి కథలే చేయమంది… కృష్ణతేజ కామెడీ బాగా వర్కవుట్ అవుతుంది. హైదరాబాద్ ముస్లిం పాత్రలో అతను నటించాడు. ఇక హీరోయిన్ స్నేహితులు ఇరుక్కునే సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయి. నా భార్య గీతా మాధురి ఈ సినిమా చూసి… మంచి సినిమా చేశావు అని మెచ్చుకుంది. ఇలాంటి కథలే చేయమని సలహా ఇచ్చింది.
కమర్షియల్ ఎలిమెంట్స్‌తో… మా దర్శకుడు వరప్రసాద్ వరికూటి.. వి.వి.వినాయక్ దగ్గర పనిచేశారు. అదుర్స్, కృష్ణ, సినిమాల్లో ఆయనది కీ రోల్. అలాగే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాకు ఆయన పనిచేశారు. ఆ పంథా కథల్లా ఉండే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. అలాగే ఆయన ‘ఐఫోన్’ అనే ఓ షార్ట్‌ఫిల్మ్ కూడా చేశారు. అందులో డైలాగులుండవు. మేకింగ్ చాలా బాగుంటుంది. ఆయనకు అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఆయనతో సినిమా చేస్తే నాకు లైఫ్ ఇస్తాడన్న నమ్మకం కలిగింది.
నాపై నమ్మకం కలుగుతుంది… ఈ సినిమా చూసిన తర్వాత నందుతో కమర్షియల్ సినిమాలు చేయొచ్చని చాలా మందికి నమ్మకం కలుగుతుంది. ‘100% లవ్’ చిత్రంలోలాగే ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువగా ఉంటుంది. నిశ్చితార్థం నుంచి పెళ్లిలోపు జరిగే సంఘటనలే ఈ సినిమా. కథపై నమ్మకంతో ఈ సినిమా చేశాను.
అది పెద్ద విజయమే… మా సినిమాలోని ఒక పాటకు యూ ట్యూబ్‌లో వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటే అది మాకు పెద్ద విజయమే. అలాగే రీ రికార్డింగ్ కూడా బాగుంటుంది. నిర్మాతలు సినిమా నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.

Comments

comments