Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

అది ఆయన గొప్పతనం

sai

సాయిధరమ్‌తేజ్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం  ‘ఇంటిలిజెంట్’. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి.  బ్యానర్‌పై సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో సాయిధరమ్‌తేజ్‌తో ఇంటర్వూ విశేషాలు… 

అదే సినిమా కాన్సెప్ట్…
మనం జీవితంలో ఎదగడానికి కొందరు చాలా సహాయం చేస్తారు. అలాంటి వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లకు మనం కూడా సహాయం చేయాలి. ఆ సాయం చేయడానికి ఎంత దూరమైనా వెళ్లాలి. ఇదే సినిమా కాన్సెప్ట్.
తన వాళ్ల కోసం పోరాటం…
సినిమాలో నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా కనిపిస్తాను. మంచి వాతావరణంలో పనిచేసే ఆ కుర్రాడు కొన్ని కారణాల వల్ల బయటికొచ్చి తన వాళ్ల కోసం ఎలా పోరాడుతాడు, కష్టాలను ఎలా తప్పించుకుంటాడు అనేదే ఈ చిత్రం.
చాలా సంతోషంగా ఉంది…
స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్‌తో ఈ సినిమా చేస్తానని అస్సలు ఊహించలేదు. ‘ఖైదీ నంబర్ 150’ వంటి బిగ్గెస్ట్ హిట్‌ను తెరకెక్కించిన తర్వాత ఆయన నాతో ఈ సినిమా చేశారు. నన్ను పిలిచి మరీ ఈ సినిమా చేయడం ఆయన గొప్పతనం. ఆయనతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.
మంచి కథ ఉండాల్సిందే…
నేను ఈ సినిమా చేయడానికి మొదటి కారణం దర్శకుడు వినాయక్. అలాగే కథ నచ్చడం రెండో కారణం. ఏ సినిమాకైనా మంచి కథ ఉండాల్సిందే. అన్ని కమర్షియల్ అంశాలతో సినిమా అద్భుతంగా రూపుదిద్దుకుంది.
భిన్నమైన సినిమాలు చేస్తా…
భిన్నమైన సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటాను. కానీ నా దగ్గరకు వచ్చే వాళ్లు కమర్షియల్ సినిమాలతోనే వస్తున్నారు. అందుకే అవే చేస్తున్నాను. అవకాశం వస్తే తప్పకుండా భిన్నమైన సినిమాలు చేస్తాను.
అందుకే అవి నచ్చలేదు…
గతంలో నేను చేసిన కొన్ని సినిమాలు పరాజయం పాలుకావడానికి కారణం అవి ప్రేక్షకులకు సరిగ్గా కనెక్ట్ కాకపోవడమే. అదేవిధంగా కథ, కథనం మేము అనుకున్నది అనుకున్నట్టుగా స్క్రీన్‌పై రాకపోవడంతో అవి ప్రేక్షకులకు నచ్చలేదు.

దర్శకుల డిమాండ్‌వల్లే…
నా సినిమాల్లో మావయ్య చిరంజీవి పాటలు రీమిక్స్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. అయితే దర్శకుల డిమాండ్‌వల్లే ఆ పాటల్ని రీమిక్స్ చేయాల్సి వస్తోంది.
పైరసీని ప్రోత్సహించవద్దు…
నా సినిమా శుక్రవారం, వరుణ్‌తేజ్ సినిమా శనివారం విడుదలవుతున్నాయి. మెగా అభిమానులంతా రెండు సినిమాల్ని థియేటర్లలోనే చూడండి. పైరసీని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించవద్దు.

Comments

comments