Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అనే రోజు వస్తుంది

Special Interview With Senthil Kumar

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్‌దేవ్
కథానాయకుడిగా రాకేష్ శశి దర్శకత్వంలో
తెరకెక్కిన చిత్రం ‘విజేత’. సాయి కొర్రపాటి నిర్మాణ
సారధ్యంలో వారాహి చలన చిత్ర పతాకంపై రజని కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ సినిమాకు ‘బాహుబలి’ ఫేమ్ కె.సెంథిల్‌కుమార్
కెమెరామెన్‌గా చేశారు. ఈ చిత్రం ఈనెల 12న
విడుదలకానుంది. ఈ సందర్భంగా
కె.సెంథిల్‌కుమార్‌తో ఇంటర్వూ విశేషాలు…

కథ నచ్చి చేశాను…
సంక్రాంతి పండుగకు నేను రాజమౌళి ఫామ్‌హౌజ్‌కు వెళ్లాను. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సాయికొర్రపాటి నాతో ‘ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నారు’ అని అడిగారు. ఏదైనా మంచి సినిమా చేయాలని ఎదురుచూస్తున్నానని చెప్పాను. అప్పుడు ఆయన ‘ఓ కొత్త దర్శకుడు నాకు ఓ కథ చెప్పాడు. కథ చాలా బావుంది. కథ విని నచ్చితే సినిమా చేయండి’ అని అన్నారు. దర్శకుడు రాకేష్ చెప్పిన కథలో అందరికీ కనెక్ట్ అయ్యే భావోద్వేగ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. కథ నచ్చి ఈ సినిమా చేశాను.
కొత్తగా మలిచాడు…
తండ్రి, కొడుకుల మధ్య నడిచే సినిమా ఇది. మధ్య తరగతి కుర్రాడి కథతో సినిమా తెరకెక్కింది. దర్శకుడు రాకేష్ సన్నివేశాలను చాలా కొత్తగా మలిచాడు. బ్లాక్‌బస్టర్ సినిమాలు ఈగ, మగధీర, బాహుబలి సినిమాలకు కెమెరామెన్‌గా చేశాను. ఆ చిత్రాల్లాగానే నాకు మంచి పేరు తెచ్చే చిత్రంగా ‘విజేత’ నిలుస్తుంది.
హృదయానికి నచ్చినవే చేస్తా…
అన్ని సినిమాలను పేరు కోసమే చేయలేం. ఉదాహరణకు ‘గోల్కొండ హైస్కూల్’ సినిమా నాకు గొప్ప పేరు వస్తుందని చేయలేదు. నేను ఇష్టపడే ఆటల్లో క్రికెట్ ఒకటి. కాబట్టి ఆ సినిమా చేశాను. నా హృదయానికి నచ్చిన సినిమాలే చేస్తాను.
మంచి కథలు రావడం లేదు…
బాలీవుడ్‌లో కూడా నాకు అవకాశాలు వచ్చాయి. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించిన ‘దఢక్’ సినిమా చేయమని అడిగారు. అలాగే పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల నుండి అవకాశాలు వచ్చాయి. అయితే నేను ఎదురు చూసే మంచి కథలు నాకు రావడం లేదని అనిపించింది. దాంతో నేను అటువైపు వెళ్లలేదు. బాహుబలి తర్వాత హిందీలో సినిమా చేయాలనే ఆసక్తి తగ్గింది. ఎందుకంటే సౌత్‌లో మనమే వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో సినిమాలు చేస్తున్నాం. అలాగని హిందీ సినిమాలు చేయనని కాదు. నాకు నచ్చితే తప్పకుండా చేస్తాను.
తెలుగు సినిమాలకు సువర్ణాధ్యాయం…
ఇప్పుడు తెలుగు సినిమాలకు సువర్ణాధ్యాయం నడుస్తోంది. బాహుబలి, ఘాజీ, రంగస్థలం, అర్జున్ రెడ్డి, గరుడ వేగ, మహానటి… ఇలా వైవిధ్యమైన సినిమాలు వస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులు కొత్తదనం ఉన్న సినిమాలను చూస్తున్నారు. దాంతో ఫిల్మ్‌మేకర్స్ కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు చేయాలని చూస్తున్నారు. ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అనే రోజు తప్పకుండా వస్తుంది.
డైరెక్టర్ అవుతాను…
ప్రతి ఒక్క టెక్నీషియన్‌కి దర్శకుడు కావాలనే ఆశ ఉం టుంది. ఎందుకంటే ఏ టెక్నీషియన్ అయినా దర్శకుడు చెప్పిన కథకు తమ వంతు సహకారాన్ని అందిస్తారు. అం దుకే డైరెక్టర్ కావాలని కోరుకుంటారు. నేను కూడా డైరెక్టర్ అవుతాను. కానీ ఎప్పుడు అవుతానో ఇప్పుడే చెప్పలేను. వెంటనే డైరెక్షన్ చేసేయాలని ఆశ లేదు

Comments

comments