Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

అందుకే కెరీర్ బాగుంది…

shr

సీనియర్ నటుడు మోహన్‌బాబుతో కలిసి అందాల తార శ్రియా నటించిన చిత్రం ‘గాయత్రి’. ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన శ్రియా హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె చెప్పిన విశేషాలు… 

అమాయకురాలైన అమ్మాయిగా…
‘గాయత్రి’లో నేను పల్లెటూరికి చెందిన అమాయకురాలైన అమ్మాయిగా కనిపిస్తాను. నిజాయితీగా ఉండే అమ్మాయిగా నటించాను. ఈ పాత్ర నా కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలుస్తుంది.

 అందుకే ఒప్పుకున్నా…
దర్శకుడు మదన్ చెప్పిన కథ నాకు చాలా బాగా నచ్చింది. నా పాత్ర కూడా సహజంగా, అందంగా ఉంటుంది. అందుకే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను.

ఎక్కడా ఇబ్బంది పడలేదు…
దర్శకుడు మదన్ చాలా కూల్‌గా ఉంటారు. ఆయనతో కలిసి పనిచేసినప్పుడు ఎప్పుడూ ఇబ్బందిపడలేదు. ఆయనతో వర్క్ చేయడం చాలా బాగుంది.

పూర్తిగా ఎంజాయ్ చేశా…
సినిమా షూటింగ్‌ను పూర్తిగా ఎంజాయ్ చేశాను. నా మీద ఒక అందమైన పాట కూడా ఉంది. ముఖ్యంగా నా కాస్టూమ్ డిజైనర్ రూపొందించిన డ్రెస్సులు చాలా బాగా నచ్చాయి.

 అందుకే కెరీర్ బాగుంది…
నేను చేసిన సినిమాల దర్శకులు, రచయితలు మంచి కథలు, పాత్రలు రాశారు కాబట్టి నా కెరీర్ చాలా బాగుంది. అలాగే నేను ఎంపికచేసుకున్న సినిమాలు నాకు బాగా కలిసి వచ్చాయి. అంతేకాకుండా నేను చాలా లక్కీ కూడా.

 తదుపరి చిత్రాలు…
ప్రస్తుతం తెలుగులో ‘వీర భోగ వసంతరాయలు’ సినిమా చేస్తున్నాను. తమిళంలో కార్తీక్ నరేన్‌తో ‘నరససూరన్’లో నటిస్తున్నాను. ఆతర్వాత శాతకర్ణి సినిమా కెమెరామెన్ నిర్మాతగా మారి చేస్తున్న సినిమాలో కూడా నటించబోతున్నాను. ఆ చిత్రాన్ని ఒక లేడీ డైరెక్టర్ తెరకెక్కించనున్నారు.

Comments

comments