Home దునియా రచయితలకు జాబ్ సాటిస్ ఫాక్షన్ ఉంటుందే కానీ…

రచయితలకు జాబ్ సాటిస్ ఫాక్షన్ ఉంటుందే కానీ…

Tanikella-bharani

అక్షరాల దొంతరలు పేర్చి,,, ఆ అక్షరాల్లో పాత్రలకు జీవంపోసి నటనే జీవితంగా… జీవితమే ఒక నాటకంగా దశాబ్దాల తరబడి ప్రేక్షకుల మన్నలను పొందుతున్న కళాకారుడు తనికెళ్ళభరణి.. అనేకచిత్రాలకు సంభాషణలను సమకూర్చి తెలుగుచలనచిత్ర రంగంలో ప్రత్యేకముద్రవేసిన నటుడు తనికెళ్ళ.. వెండితెరపై విభిన్న పాత్రల్లో నటించి..ప్రేక్షకులను మెప్పించిన రచయిత..నటుడు తనికెళ్ళ భరణి. సహజకవి,నటుడు ,నిర్మాత ఘాటైన పదాలను ప్రయోగిస్తూ..వాడిగా సంభాషణలు రాసే తనికెళ్ళ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒకప్రత్యేక స్థానాన్ని సంపాధించుకున్న క్యారెక్టర్ నటుడు…. పాత్రల్లో జీవిస్తూ…ప్రేక్షకులను మెప్పిస్తూ ముదందుకు సాగుతున్న తనికెళ్ళ జీవన శైలి ఆదర్శమైంది… రచన,నటన తో పాటుసామాజిక సేవా, ఆధ్యాత్మికవిలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న తనికెళ్ళ జీవనప్రయాణం వీధినాటకాలనుంచి ప్రారంభమైంది. అనేక అవార్డులను సొంతం చేసుకుని ప్రతిభకు ఎల్లవేళల పదును పెడుతున్న తనికెళ్ళ అతిసామాన్యమైన కుటుంబంనుంచి ఎదిగిన నటుడు.రచయిత.. ఆయనకు పేదరికం వేసే ప్రశ్నలు తెలుసు, అద్దింటి లో ఇంటియజమాని వేదింపులు తెలుసు…అందుకే ఆయన పాత్రల్లో నటించరు జీవిస్తారు..రచనల్లో జీవితాలను ఆవిష్కరించే
తనికెళ్ళ భరణి తో హరివిల్లు ప్రత్యేక ఇంటర్వూ….

ప్రశ్న.బాల్యంలో అనేక అల్లరిపనులు చేసేవారంటారు అది ఎంతవరకు వాస్తవం ?
జ. బాల్యంలో అల్లరి చిల్లర పనులు చేయడం తో పాటు ఇంట్లో పేపర్లు దొంతనంగా అమ్మిన సందర్భంకూడా ఉంది. ప్రధానంగా నాస్నేహితులు కూడా అందరూ నాలంటివారే. సికింద్రాబాద్ లోని హమాలీ భస్తీ లోని స్నేహితులతోనే దాదాపుగా నాబాల్యంగడిచింది. అల్లరిచిల్లరగా తిరిగే అలవాటు అప్పట్లో ఎక్కువగా ఉండేది.సికింద్రాబాద్ లోని కె.ఎం. ఆసుపత్రి ( గాంధీ ఆసుపత్రి) లో నేనుపుట్టాను. చిలకలగుడలోని 221/1/ రైల్యే క్వాటర్ మా ఇల్లు.మానాన్న రైల్వేలో పనిచేశారు. అయితే రైల్వేలో పనిచేసే ముందు మానాన్న టి.వి.ఎస్.ఎస్ రామలింగేశ్వర రావు హైదరాబాద్ లోని టెంకం పేట దొర కొడుకుకు కొన్నాళ్ళు చదువుచెప్పారు. ఆతర్వాత రాణిగంజ్ లోని బట్టలషాపులో కొంతకాలం పనిచేశారు. అందుకే బాల్యం లో పేదరికం వేసే ప్రశ్నలకు ఎప్పటికప్పుడు జవాబుల కోసం ప్రయత్నించే వాడిని.

ప్రశ్న.హైదరరాబాద్‌లో పుట్టి పోరిగిన మీకు సొంత ఇంటి కల ఎప్పుడు నెరవేరింది.
జ.హైదరాబాద్ లో అద్దెకు ఉండేవారిని ఇంటి యజమానులు హింసించే సంఘటనలను ప్రత్యేక్షంగా అనుభవించాను. ఖమ్మం జిల్లా తనికెళ్ళ నుంచి బతుకు తెరువుకోసం అమ్మనాన్న హైదరాబాద్ కు వచ్చి అద్దె ఇంట్లో పడినబాధలు అనేకం ఉన్నాయి. చిన్నప్పటినుంచి నేను అద్దె ఇళ్ళల్లోనే పెరిగాను . నాన్న పాన్ బజార్ లో పనిచేసేటప్పుడు ప్రాంభమైన అద్దెఇళ్ళ సమస్య సంవత్సరాలతరబడి కొనసాగింది. కొంతకాలం మిర్జాగుడ అద్దెఇంట్లో గడిపాము. నాన్న కు రైల్వే ఉద్యోగం రావడంతో రైల్వే క్వాటర్స్ కు వెళ్ళినా రిటైడ్ అనంతరం తిరిగి అద్దెఇల్లే … ఎంతో కష్టపడి యూసుఫ్ గుడలో సొంతఇల్లు కట్టుకుని ఆ ఇంటికి సౌందర్యలహరి అని పేరుపెట్టాము. అందుకే ప్రత్యేక్షంగా అనుభవించిన బాధలనే అద్దెకొంప నాటకంలో రాసి ఇంటి ఓ నర్లకు షెటైర్లు వేశాను.
ప్రశ్న. చలనచిత్రాలకు పదునైన సంభాషణలు రాసిన మీ సాహిత్య గురువు ఎవరు ?
జ.సహజంగా మాది పండితుల వంశం. దివాకర్ల తిరుపతివెంకటకవుల్లోని దివాకర్ల తిరుపతు శాస్త్రీ తమ్మునికూతురు మానాయనమ్మ, ఖమ్మం జిల్లాలోని తనికెళ్ళ మాసొంతగ్రామం, మందలసంవత్సరాలక్రితం మా అమ్మ వంశీయులు పశ్చిమగోదావరికి వెళ్ళినట్లు చెపుతారు. మేము ఏడుగురము అన్నతమ్ములము.చిన్నప్పటినుంచి ఇల్లు సాహిత్యానికి వేదికగా ఉండేది. నాన్న టి.వి.ఎస్.ఎస్. రామలింగేశ్వరరావు రాగయుక్తంగా మేఘసందేశం, కుమారసంభవం, కురుక్షేత్రం పద్యాలను పాడేవారు. అలాగే అన్నతమ్ముళ్ళకు సాహిత్యం లో ప్రవేశం ఉండేది. ఇంగ్లీషు,సంస్కృతం చిన్నప్పటినుంచే వినేవాడిని. అయితే బతుకుతెరువుకోసం అమ్మానాన్న హైదరాబా ద్ వచ్చారు. నాన్న ట్యూషన్లు చెప్పడం తో పాటు షాపుల్లో పనిచేసేవారు. అయితే ప్రత్యేకంగా నాసాహిత్యానికి గురువు లేక పోయినా కొంతకాలం పరబ్రహ్మశాస్త్రీ దగ్గర సంస్కృతానికి సంబంధించి అమరకోశం అభ్యసించాను…చిన్నప్పటినుంచి పుస్తకాలు బాగా చదివే అలవాటు వచ్చింది.. ఈ నేపధ్యంలో నే నక్షత్రదర్శనం. ఆటగదరా శివ. పరికిణీ. ఎందరో మహానుభావులు. గార్థభాండం. గోగ్రహణం.కొక్కౌరోకో. జంబుద్వీపం.ఛల్ ఛల్ గుర్రం రచనలు చేశాను .

ప్రశ్న.మీరు మీలక్ష్యాన్ని చేరుకోవడానికి ఏమేరకు కృషిచేశారు?
జ. నాకు చిన్నతంనం లో ఎలాంటిలక్ష్యాలు లేవు,,చిన్నతంనం లో నేను బిలో అవరేజి స్టూడెంటు్ ను నాకు చదువు పెద్దగా అబ్బలేదు. అయితే కళలపట్ల ఆసక్తి మాత్రం ఉండేది.హరిదాసు కథలు చెప్పుతుం లీనం అయ్యే వాడిని, అతనిమాదిరిగా ఇంట్లో కథలు చెప్పేందుకు ప్రయత్నం చేశాను.ఏనాడు సినీ నటుడిని అవుతాననికాని, రచయితనవుతానానికాని అనుకోలేదు. నటకాలు చూసి ఆనందించేనేను రంగస్థలనటుడిని అయితే చాలు అని అనిపించేది. ఎవరైన జీవితంలో ఏమి అవుతామని అడిగితే నాకు ఒక తమాష అయిన కోరిక ఉండేది. మెకానిక్ కావాలనే కోరిక.ఉండేది. చిలకల గూడలోని మెకానిక్ షాపుల్లో చినిగిన మాసిన దుస్తులు వేసికోని బైకులు నడిపించే వారు ఉండేవారు. వారిని చూసినప్పుడు నాకు అలాంటి మెకానిక్ కావాలనే కోరిక ఉండేది.

ప్రశ్న. నిర్దిష్టమైన లక్ష్యం లేకుండా మీరు స్వతహాగా ఎలా ఎదిగారు ?
జ. ఇంటర్మీడియట్ వరకు ఎలాంటి లక్ష్యం లేకుండానే సాధారణవిద్యార్థిగా అల్లరి చిల్లర పనులు చేశాను. ఇంటర్మీడియట్ కాగానే ఆరోజుల్లో పేరున్న ఏ కళాశాలలో నాకు అడ్మిషన్ రాలేదు. ఎందుకం నాకు వచ్చిన మార్కులు ఆలా ఉన్నాయి. అప్పుడే కొత్తగా వచ్చిన సాంఘీ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో అడ్మిషన్ వచ్చింది. మా అల్లరి చిల్లర గ్యాంగ్ అంతా అందులో చేరాము. ఆ సమయంలో ఆర్.వి. నర్సింహారావు(రాళ్ళపల్లి) కలిశారు. ఆరోజునుంచి నాకు నాటకరంగం వైపుదృ ష్టి మళ్ళింది. కళాశాలో నాటకాలు వేసేవాడిని. నాటకాలు వేసేందుకు డబ్బులు లేనిరోజుల్లో ఆలిండియా రేడియో యువభారతిలో లో నాటకాలు రాసి,దూరదర్శిని లో నాటకాలు ప్రదర్శించి వచ్చిన డబ్బుల తో వీధినాటకాలు వేశాము. ముదట నెల్లూరు కళాపరిషత్ కు ఎంట్రీ పంపాను వాళ్ళురమ్మ న్నారు, ఆరోజుల్లో రవీంద్రభారతి, నారద గానసభలో నాటకాలు వేసే ఆర్థిక స్థోమత మా నాటక బృందానికి లేదు.

ప్రశ్న. రచయితగా ప్రేక్షకులను ఆకట్టుకున్న మీరు రచనలను పక్కకు పెట్టి నటనకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు ?
జ.రచయితలకు జాబ్ సాటిస్ ఫాక్షన్ ఉంటుందే కానీ జేబు సాటిస్ ఫాక్షన్ ఉండదు. గతంలో రచయితకు పేమెంట్స్ సరిగ్గా ఉండేవి కావు, రాత్రిం బవళ్ళుకష్టపడాలి, సినిమా ఎంతకాలం తీస్తే అంతకాలం షూటింగ్ లోనే ఉండాలి సన్ని వేశాలకు తగ్గట్లుగా అప్పటికప్పుడు రాసినా జేబులు కాళీగానే ఉండేవి.10 ఏళ్ళ పాటు సినిమాలకు రాసి అనేకపాత్రల్లో నటించాను. అయితే ప్రధానంగా నేను నటున్నే, ఇక్కడ మరో విషయాన్ని ప్రస్థావించక తప్పదు. నూతనత్వాన్ని ఎప్పటికప్పుడు రాసే రచయితల కొరత ఎప్పుడు సినీరంగం లో ఉంటుంది. నైపుణ్యతగల రచయితలకు ఎప్పుడు అవకాశాలు వస్తూనే ఉంటాయి కానీ నటులకు అంత తోందరగా అవకాశాలురావు.అందుకే నటున్ని అయినా రచయితగా సినిమారంగం లోకి ప్రవేశించాను

ప్రశ్న. నటుడు రచయిత అయితే ఎలాంటి లాభాలు ఉంటాయి?
జ.నటుడికి పాత్రకు సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన ఉంటుంది. మేకప్ నుంచి నటించేంతవరకు సన్నివేశాల ప్రాధాన్యత తెలుస్తుంది. ముగింపు లేని కథనాటకం లో ప్రధానపాత్ర రాళ్ళపల్లి వేయాలి కానీ రాళ్ళపల్లి వేశాలకోసం మద్రాసుకు వెళ్ళడం తో అప్పటికప్పుడు ఆ ప్రధానపాత్ర వేయాల్సివచ్చింది. రైలుకళామందిర్ లో వేసిన ఈనాటకంలో నాకు ఉత్తమనడుగా అవార్డువచ్చింది.

ప్రశ్న.సినిమాల్లో పంచ్ డైలాగుల ప్రభావం ఎప్పటివరకు ఉంటుంది.
జ.పంచ్ డైలాగులప్రభావం ఒకదశవరకు ఉంటుంది. మాయాబజార్ లో ఏ పంచ్ డైలాగులు ఉన్నాయి?. ఇప్పటి వాళ్ళు చూస్తే మహాభారతమంతా తెలుగులోనే జరిగిందనే భావన వస్తుంది.కంచు కవచం సినిమాతో ఎంటర్ అయ్యాను. రచయితగా 51 సినిమాలకు స్క్రిప్ట్ రాశాను అందులో అనేక సినిమాలు విజయవంతం అయ్యాయి. శివ సినిమాలో నానాజి పాత్ర తో పాటు అనేకసినిమాల్లో నేను నటించిన పాత్రలను ప్రజలు ఆదరించారు.

ప్రశ్న. ఎప్పటినుంచి మీ పెన్నును పక్కనపెట్టి నటన కే ప్రాధాన్యత ఇస్తున్నారు.
జ. యమలీల సినిమాతో పెన్నుపక్కకుపెట్టాను అయితే ప్రస్తుతం రచయితలకు ఆదాయం బాగానే ఉంది. ప్రస్తుతం రచయితల ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. సినిమాల్లో నటిస్తూనే నేనుదర్శకత్వం వహించే సినిమాలకు నేనేకథరా సుకుంటాను.అయితే ఇది ఎంతవరకు ఉంటుందో చూడాలి. పేరు,డబ్బులు వచ్చే అవకాశం ఉం తప్పక సంభాషణలు,కథ రాస్తాను. ఎందుకం దేని మజాదానిదే..

ప్రశ్న.రచయిత,నటుడిగా ప్రజలను మెప్పించిన మీలో సామాజిక సృహ,బాధ్యత ఏమేరకు ఉంది?
జ. నిర్భయ సంఘటన నన్నుకలిచివేసింది. నిర్భయదోషులకు శిక్షపడేంతవరకు నేనునల్లని దుస్తులు ధరించానని అందరికీ తెలుసు, ప్రతి వ్యక్తి లో రెండో షేడ్ ఉంటుంది. ఆ షేడ్ ను సామాజిక బాధ్యతగా స్వీకరిస్తే బాగుంటుంది. కళాకారులు తప్పకస్పంధించాలి. ప్రధానంగా గోగ్రహణం లాంటి సామాజిక కోణం ఉన్నఅభ్యుదయ రచన చేసిన నాకు సమాజం పై బాధ్యతకూడా అధికంగానే ఉంటుంది.

ప్రశ్న. ప్రజాధరణ ఉన్న మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా?
జ.రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు. కళాకారుని మనస్సు సున్నితంగా ఉంటుంది. సంఘటనలకు కన్నీల్లు వస్తుంటాయి అలాంటి నేను రాజకీయాల్లో వచ్చే ఆసక్తీ లేదు.సమాజం కోసం నేను చేయాలనుకునే పనులు చేస్తూనే ఉంటాను. ప్రస్తుతం మహబూబ్ నగర్ జడ్చర్ల లోని కందూరులో కాకతీయులనాటి శివాలయాన్ని పునరుద్ధరించాను. దీని ప్రేరణ సమాజంపై ఉంటుందని భావిస్తాను.కవిసార్వభౌముడు శ్రీనాథుడు పుట్టిన సింగరాయకోండ లో కాంస్యవిగ్రహం పెట్టాలని ఆలోచిస్తున్నాను.బమ్మెర లో పోతన విగ్రహాన్ని ప్రతిష్టించాలని నాప్రగాఢ సంకల్పం.ఏ దేశానికి వెళ్ళినా తెలుగు సంస్కృతి,భాష కు ప్రాధాన్యత ఇస్తాను.

ప్రశ్న. సినిమా ప్రభావం సమాజంపై ఉందా..సమాజం ప్రభావం సినిమాపై ఉందా?
జ. పరస్పరం ప్రభావం ుంటుంది. నాగయ్యతీసిన మందేమాతరం సినిమా ప్రభావం ప్రేక్షకులను కదిలించింది. సినిమాల్లో హిరో,హిరోయిన్ల హవభావాలను, దుస్తులను ప్రేక్షకులు అనుకరిస్తుంటారు. అయితే మంచినే తీసుకోవాలని నేను కోరుతున్న. నిజానికి సినిమాల్లో ప్రదర్శిస్తున్న హింసకం అధికంగా సమాజంలో జరుగుతుంది.సమాజంలో జరుగుతున్న దుర్మార్గాన్ని సరిగ్గా చూపలేకపోతున్నామని అనిపిస్తుంది.

ప్రశ్న.పౌరాణిక సినిమాలు తగ్గి పోవడానికి కారణాలు?
జ. పౌరాణిక చిత్రాలు తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఖర్చు ఎక్కువ. నటించే నటులు తక్కువగా ఉన్నారు. పౌరాణిక సినిమాలు తీసేవాల్ళు లేరు, చేసేవాళ్ళు లేరు, అయినా చూసేవాళ్ళు మాత్రం ఉన్నారు. ఎవరైన సాహసం చేస్తే అదే సంప్రదాయం కొంతవరకు కొనసాగుతుంది.
ప్రశ్న. మీకు ఆధ్యాత్మిక చింతన అధికమంటారు, బోళాశంకరుని పై అనేకరచనలు చేసేందుకు ప్రేరణ?
జ.మేముతరతరాలనుంచి శివభక్తులం అయినా వైష్ణవాన్నిగౌరవిస్తాం. శితత్వాలను రాసి నాలోని భావాలను వ్యక్తం చేశాను.ఆటగదరా శివ అంటూ రాసిన తత్వాలు,శబాష్ రాశంకర సంపుటి ధరణపొందాయి….
ఆటగదరానీకు,
దూర్జటి కవిపలుకు
ఆటగద
శ్రీకాళహస్తిమహిమ
ఆటగదరానీకు
కాళిదాసునికవిత
సుకుమారసంభవం
బాట నీకు… అంటూ శితత్వాన్ని ప్రజలముందుంచాను.

ప్రశ్న.మీరు రాసిన పరికిణి కవితాసంకలనంలోని పాత్రలగురించి మీస్పందన?
జ. మధ్యతరగతి బతుచిత్రం. కాపురానికివేళ్ళిన కోడలి బాధ ఇందులో ఉంది. 62 కవితల్లో మధ్యతరగతినటరాజు, భారం..భారంగా .కన్యాకుమారి తదితర కవితల్లో కవిస్పందన అగుపిస్తుంది..

ప్రశ్న. మీరు నిర్మించిన మిథునం విజయవంతంతో మరో చిత్రనాన్ని నిర్మించే ఆలోచన ఉందా ?
జ. మిథునానికి నంది అవార్డు తోపాటు అనేక అవార్డులు అంతర్జాతీయ స్థాయిలో వచ్చాయి, ప్రేక్షకులు ఈచిత్రాన్ని ఆధరించారు. ఈ నేపధ్యం లో ప్రస్తుతానికి ఆలోచన లేకున్నా భవిష్యత్తు లో సీతారాములు,లక్ష్మణుడు పాత్రల తో వనవాసం చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచన ఉంది. ఎన్నోరచనలు… మరెన్నోపాత్రల్లో నటించి ప్రజలను మెప్పించిన తనికెళ్ళభరణి తెలంగాణ ముద్దుబిడ్డ. ఆయన రచనల్లో అభ్యుదయం..మాటల్లో పదును. సంబాషణల్లో పంచ్ డైలాగులు ఎన్నో ఉంటాయి..సామాజిక బాధ్యత తో ముందుకు వెళ్ళుతున్న భరణి రచించిన ప్యాసా లో ప్రేమను ఇతివృత్తంగా తీసుకుని రాసిన కవితల్లో విరహాన్ని,ఏకాంతాన్ని,హృదయస్పందన ఈవిష్కరించిన తీరు మనసు పొరలను తట్టుతుందనడం అతిశయోక్తి కాదు.

                                                                                                                                                                                             వి.బి.ఆర్