Home తాజా వార్తలు కుంభమేళా యాత్రికుల కోసం ప్రత్యేక జియో ఫోన్…

కుంభమేళా యాత్రికుల కోసం ప్రత్యేక జియో ఫోన్…

 JIO Phoneన్యూఢిల్లీ: దేశీయ టెలికాం రంగంలో పెను సంచలనం తెచ్చింది జియో ఫోన్. అయితే, రిలయల్స్ జియో తాజాగా సరికొత్త విప్లవానికి శ్రీకారంచుట్టింది. అలహాబాద్‌లో జరుగుతున్న కుంభమేళాకు ప్రత్యేక ఎడిషన్ ను కానుకగా అందిస్తోంది. కుంభమేళా యాత్రికుల కోసం కుంభ్ జియో ఫోన్‌ను విడుదల చేసింది. ఈ జియో ఫోన్ మీ అరచేతిలో ఉంటే.. యావత్ కుంభమేళా మీ చెంతన ఉన్నట్లే.. కుంభ్ జన సముద్రంలో యాత్రికులకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని సంబంధిత అధికారులు అంటున్నారు. ఈ ఫోన్ తో బస్సులు, రైళ్ళు టికెట్లు బుకింగ్, దగ్గర్లోని రవాణా అత్యవసర ఫోన్ నంబర్లు, అత్యవసర సేవల ప్రదేశాలు వంటి ఫీచర్లను ఇందులో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

Special JIO Phone for Kumbh Mela