Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ

Thummala-Nageshwar-Raoఅశ్వారావుపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం
రూ. 5.౩౦ కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
బ్రిడ్జీల నిర్మాణంతో గిరిజనుల చిరకాల కోరిక తీరుతుంది
అభివృద్ధి పనుల కార్యక్రమంలో మంత్రి తుమ్మల

ములకలపల్లి: రాష్ట్రం ఏర్పాటు అయిన నాటి నుంచి గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు ఆయా ప్రాంతాలకు మౌలిక వసతులు కల్పించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నారని రాష్ట్ర రహదారుల, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం ములకలపల్లి మండలంలోని తిమ్మంపేట గ్రామంలో సాకివాగుపై రూ.2.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వంతెనుకు, కొబ్బరిపాడు గ్రామంలో పామిలేరు వాగుపై రూ.2.70 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న వంతెనకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో అధికంగా గిరిజనులు ఉన్న ప్రాంతం కావడంతో గిరిజన గ్రామాలను అన్ని విధా లుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేన్నారు.

సాకివాగు, పామిలేరు వాగులపై వంతెనలు లేకపోవడం వల్ల ములకలపల్లి నుంచి బూర్గంపాడు, బూర్గంపాడు నుంచి ములకలపల్లి వరకు వచ్చే ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. అందుకే ప్రత్యేక చొరవ తీసుకుని రెండు వాగులపై వంతెనలు నిర్మాణం చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఈ రెండు వంతెనల నిర్మాణం ఈప్రాంత ప్రజల చిరకాల కోరిక అని చెప్పారు. వచ్చే ఏడాది జూన్ నాటికి వంతెనల నిర్మాణం పూర్తి చేయనున్నట్లు తుమ్మల వివరించారు. ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించాలన్న లక్షంతో రాష్ట్ర ప్రభుత్వం జలహారం కార్యక్రమం చేపట్టిం దన్నారు. రానున్న కాలంలో ఈ ప్రాంత ఆడపడుచులు చెలిమల నుంచి, వాగుల నుంచి మంచినీరు తెచ్చుకోకుండా పరిశుభ్రమైన మంచినీటిని ప్రతి ఇంటికి అందిస్తామని చెప్పారు.

అదే విధంగా మండలంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించి భూములను సస్యశ్యామలం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ ప్రాంతంలో రహదారుల సౌకర్యంతో పాటు విద్య, వైద్య సౌకర్యాలు అందించేందుకు నిరంతరం కృషి చేయనున్నట్లు తెలిపారు. అశ్వారావుపేట శాసన సభ్యులు తాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ లింగయ్య, జడ్‌పిటిసి బత్తుల అంజి, ఎంపిపి కుర్సం శాంతమ్మ, ఎంపిటిసిలు నూప సరోజిని, మడకం జయ, సర్పంచులు కీసర లక్ష్మి, కారం వెంకటేశ్వర్లు, ఎంపిడిఒ నాగలక్ష్మి, ఐకెపి ఎపిఎం రవికుమార్, పిఎసిఎస్ అధ్యక్షులు పరుచూరి కృష్ణ, ఉపాధ్యక్షులు పువ్వాళ్ల మంగపతి, టిఆర్‌ఎస్ మండలాధ్యక్షులు ఎస్‌కె.నబీ సాహెబ్, నాయకులు పర్వతనేని అమరనాథ్, ఎ.నర్సింహారావు, సీతారాములు, వైస్ ఎంపిపి రమణ తదితరులు పాల్గొన్నారు

Comments

comments