Home కుమ్రం భీం ఆసిఫాబాద్ రూ.40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు

రూ.40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు

Special plans to open the closed industries

మూతబడిన పరిశ్రమలను తెరిపించడానికి ప్రత్యేక ప్రణాళికలు
పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడటమే ముఖ్యమంత్రి కెసిఆర్ ధ్యేయం
బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం
ఎస్పీఎం మిల్లు లాంటి మరిన్ని మిల్లులను సైతం ప్రారంభిస్తాం
కాగజ్‌నగర్ బహిరంగ సభలో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/ఆసిఫాబాద్/కాగజ్‌నగర్: దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను తెలంగాణ రాష్ట్రంలో తెరాస సర్కార్ అమలు చేస్తోందని, 40 వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వెల్లడించారు. గురువారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని మూతబడిన సిర్పూర్ పేపర్ మిల్లును పునః ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి కెటిఆర్ సిర్పూర్ పేపర్ మిల్లు క్రీడా మైదానంలో సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు, ఎస్పీఎం కార్మికులను ఉద్దేశించి ప్రస ంగించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాం లో తెలంగాణ అన్ని విధాల అన్యాయానికి గురైందని, గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభు త్వం తెలంగాణ వ్యాప్తంగా కేవలం 29 లక్షల మందికి 200, 500 చొప్పున ఆసరా పెన్ష న్లు ఇవ్వగా, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా 42 లక్షల మందికి వెయ్యి, 1500 రూపాయల వంతున ఆసరా పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు.

ఈ రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం ద్వారా నూతన పరిశ్రమలను ప్రారంభించి ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్షంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు. మూతబడిన పరిశ్రమలను తెరిపించడమే కాకుండా, ప్రస్తుతం కొనసాగుతున్న కర్మాగారాలను విస్తరింపజేసి తద్వారా మరింత మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆ దిశగానే తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, రాష్ట్రంలో నూతనంగా పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి వస్తున్న పారిశ్రామికవేత్తలకు కేవలం 15 రోజుల్లోపు అన్ని అనుమతులు ఇవ్వడమే దీనికి నిదర్శమని పేర్కొన్నారు. అదే విధంగా మూతబడిన పరిశ్రమలను నడిపేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు అన్ని రాయితీలు, ప్రోత్సహాకాలు అందించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్లును నడిపేందుకు ముందుకు వచ్చిన జేకే పేపర్ మిల్స్ యాజమాన్యానికి సైతం తమ ప్రభుత్వం పదేళ్ల పాటు అన్ని రాయితీలు, ప్రోత్సాహాకాలు అందిస్తోందని స్పష్టం చేశారు.

చిన్న పరిశ్రమలను సైతం ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇండస్ట్రియల్ హెల్త్ క్లీనిక్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తోందని అన్నారు. కాగజ్‌నగర్‌లో మూతబడిన సిర్పూర్ పేపర్ మిల్లును పునః ప్రారంభించడమే కాకుండా ఈ మిల్లులో పని చేసిన వారందరికీ, ముఖ్యంగా కాంట్రాక్టు కార్మికులకు సైతం న్యాయం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. వచ్చే 4, 5 నెలల్లోపు పేపర్ మిల్లులో సైరం మోగి తిరిగి కార్మికులు ఆనందంతో డ్యూటీలకు వెళ్లే కార్యక్రమానికి రూపకల్పన చేశామని మంత్రి చెప్పారు. ఒక సిర్పూర్ పేపర్ మిల్లు పరిశ్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మూతబడి ఉన్న అనేక పరిశ్రమలను గాడిలో పెట్టడానికి తమ ప్రభుత్వం పని చేస్తోందని, అందులో భాగంగా నల్గొండ జిల్లాలో భీమ సీమెంట్ కంపెనీ, రామగుండంలో ఫర్టీలైజర్ కంపెనీ, ఆదిలాబాద్‌లో సిసిఐ, భూపాలపల్లి ములుగులో బిల్ట్ తదితర పరిశ్రమలను తిరిగి ప్రారంభించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మంచిర్యాలలో బిర్లా సీమెంట్ కంపెనీలో యాజమాన్యంతో మాట్లాడి 3 వేల మంది స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామి ఇచ్చారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని తెరాస సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలకు, రైతులకు 24 గంటల కరెంట్ అందిస్తోందని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీరందించే అత్యత్భుత కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. రైతు బంధు ద్వారా రైతులకు ఆర్థిక సహాయం, సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలు, రైతు బీమా వంటి పథకాలను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరందిస్తామని ఆయన హామి ఇచ్చారు. పేదింటి ఆడ బిడ్డల పెళ్లిలకు లక్ష 116 రూపాయల ఆర్థిక సహాయం అందించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని చెప్పారు. కాగజ్‌నగర్‌లో ఎస్పీఎం పునః ప్రారంభం నేపథ్యంలో పండుగ వాతావరణం నెలకొనడం తనకు ఎంతగానో సంతోషాన్ని ఇచ్చిందని, ఇలా అన్ని ప్రాంతాల ప్రజలకు సంతోషాలు కలిగే విధంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్య దూరపు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని, వారు తమ ప్రభుత్వంపై, తమ కుటుంబపై పిల్లి శాపాలు పెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అయినప్పటీకి వారి శాపాలు తమకు దీవెనెలా పని చేస్తోందని అన్నారు. తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పని చేస్తోందని మంత్రి కెటిఆర్ చెప్పారు. ఈ సభలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, ఎంపీ జి. నగేష్, ఎమ్మెల్సీ పురా ణం సతీష్, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, కోవ లక్ష్మి, నడిపెల్లి దివాకర్ రావు, ప్రభుత్వ సలహాదారులు గడ్డం వివేక్, తెరాస రాష్ట్ర నాయకులు అరిగెల నాగేశ్వర్ రావు, సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ సిపి విద్యావతి, నాయకులు రవీందర్, జిల్లా కలెక్టర్ ప్రశాం త్ జీవన్ పాటిల్‌తో పాటు ప్రజాప్రతినిధు లు, ఎస్పీఎం కార్మికులు, ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.