Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

బాంచెన్ దొర నీ కాలు మొక్కుతా..

Special Story Of Dhoddi Veeraih In Jangoan Dist

 

మన తెలంగాణ/దేవరుప్పుల ః భూమి కోసం.. భూక్తి కోసం..బానిస బంధాల నుంచి విముక్తి కోసం.. వెట్టి చాకిరి విముక్తి కోసం నడుం బిగించి తెలంగాణ సాయుధ పోరాటంలో వీరమరణం పొందిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య. నైజాం దేశ్‌ముఖ్‌ల కుట్రలతో చిందిన కొమురయ్య రక్తంతో తెలంగాణ రక్తసిక్తమైంది. బాంచెన్ దొర కాలు మొక్కుతా అంటూ దొర పెత్తనం లో నలిగిన వాళ్లను బందూకులు చేత బట్టి పోరాడే దిశగా నడిపించిన ధీరుడు దొడ్డి కొమురయ్య.
దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో 1928లో దొడ్డి గట్టమ్మ, కొండయ్య దంపతులకు దడ్డి కొమురయ్య జన్మించాడు. కొమురయ్య 16వ ఏట 1944లో కొమురమ్మతో వివాహాం జరిగింది. ఈ క్రమంలో పాలకుర్తి మండలం విస్నూర్ గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని 60 గ్రామాలను దేశ్‌ముఖ్ రాపాక రాంచంద్రారెడ్డి , ఆయన భార్య జానమ్మ దొరసాని, కుమారుడు బాబుదొర ప్రజలతో వెట్టిచాకిరి చేయించుకుంటూ అన్ని రకాలుగా పీడించేవారు.ప్రజల మాన, ప్రాణ చేలగాటమాడువారు. అయితే 1943లో జరిగిన ఆంధ్ర మహాపభలో వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాడాలని ఉద్యమకారులు నిర్ణయించుకున్నారు. కడవెండి గ్రామానికి చెందిన నల్ల నర్సింహులు, దొడ్డి కొమురయ్య, దావిద్ రెడ్డి, వడ్డె నర్సయ్య, నల్ల కొండయ్య, మచ్చ రామయ్య, జంపాల లింగయ్య, పంతం లచ్చయ్య, పాముకుంట్ల ముత్తిలింగం, మాశెట్టి రాంచంద్రయ్య, ఎర్రంరెడ్డి రాంకృష్ణారెడ్డి, పైండ్ల యాదగిరి తదితరులు నైజాం సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యమానికి ఈ ప్రాంతం నుంచి ఊపిరి ఊదారు.
ప్రపంచ ఉద్యమ చరిత్రలోనే తెలంగాణ సాయుధ పోరాటం ప్రత్యేకమైంది. బానిస సంకేళ్ళతో విసిగివేసారిన జనం తిరగబడ్డ చరిత్ర.. ఎంతో మంది తమ ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడిన త్యాగ చరిత్ర.. ప్రపంచంలోని పీడిత ప్రజల్లో ఉద్యమస్పూర్తిని రగిల్చింది. కడవెండిలో నిజాం నిరంకుశ పాలనను వ్యతిరెకిస్తూ జానమ్మ దొరసాని దాష్టికాలకు స్వస్తి పలికేందుకు పీడిత ప్రజలు ఎర్రజెండా నీడలో పోరు సలిపారు. భూమి కోసం..భూక్తి కోసం…వెట్టి చాకిరి విముక్తి కోసం…ఆనాడు కడవెండిలో అంకురార్పణ జరిగిన పోరాటాల చరిత్రను రష్యా సెంట్రల్ లైబ్రరీలో భద్రపరిచారు.
గ్రామంలో జానమ్మ ఆగడాలు…
దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో అత్యదిక భూములు దొర ఆదినంలో ఉండేవి. విస్నూరు దేశ్‌ముఖ్ తల్లి జానమ్మ కడవెండినే కేంద్రంగా చేసుకొని గ్రామంలో తన హింసాకాండాను కొనసాగించింది. భూములను ఆక్రమించుకోవడం, కూలీలతో వెట్టి చాకిరి చెయించుకోవడం, తన మాట వినని వారిని చంపించడం, మహిళలను అవమానించడం, పన్నుల పేరుతో అన్ని దోచుకునేది. ఈ పర్యవసానంలోనే ఆంద్ర మహసభ అవిర్బవించింది. దీంతో గ్రామస్తుల్లో నూతన చతన్యం పుట్టుకొచ్చింది. గ్రామంలోని యువకులంతా కలిసి గుతపల సంఘం, వడిసెల సంఘం, కారంపొడి సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలోని నల్ల నర్సింహులు, ఎర్రంరెడ్డి కొండల్ రెడ్డితో పాటు గుంటూరు నుంచి వచ్చిన కొందరు సెటిలర్లు ఈ సంఘాలకు ప్రాతినిధ్యం వహించి దొరకు ఎదురు తిరిగేవారు.
దొడ్డి కొమురయ్య వీరమరణం…
గొల్ల కులానికి చెందిన దొడ్డి మల్లయ్య సంఘంలో చురుకైన కార్యకర్త అతడి తమ్ముడే దొడ్డి కొమురయ్య. 18 వయసున్న ఈ యువకుడికి దొరసాని చర్యలంటే రక్తం మరిగేది. ఆ రోజు 1946 జూలై 4 సంఘపోళ్లు దొరసాని , ఆమె గుండాల చర్యలకు వ్యతిరేకంగా గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తూ ఆంధ్రమహసభకు జై.. కమ్యూనిస్టుకు జై… అంటూ నినాదాలు చేశారు. అప్పుడే గొర్రెలను దొడ్డిలో తోలి కాళ్లూ చేతులు కడుక్కొని వదిన అన్నం పెట్టగా తింటున్న కొమురయ్య వదిన అన్న ఎటు పోయిండు అని అడిగాడు. సంఘపోళ్లు తీసుకుపోయిండ్రు అని చెప్పగాఅంతలోనే నినాదాలు అతని చెవికి తాకాయి. అన్నం వదిలి అన్నకు రక్షణగా పోతానంటూ వదినకు చెప్పి గుతప పట్టుకొని కచ్చీరు కాడికి చేరాడు. జులూస్‌లో అన్న దొడ్డి మల్లయ్య, కొమురయ్య ముందు వరుసలో ఉంటూ దొరకు వ్యతికేకంగా నినిదాలు చేస్తున్నారు. దీంతో దొరసాని జానమ్మ, ఆమే గూండాల గుండెలు గుబేలుమన్నాయి. జానమ్మ తనను ఏం చేస్తారోనని భయపడి గడి నుంచి మిస్కిన్ అలీ తో కాల్పులు జరిపించింది. దీంతో ముందు వరుసలో ఉన్న కొమురయ్య పొట్టలో బుల్లెట్లు దిగాయి. పేగులు బయటకు వస్తుండగా ఎడమ చేతితో వత్తుతూ ఆంధ్ర మహసభకు జై అంటూ నినిదాలు చేస్తు నేలకొరిగాడు. మరో బుల్లెట్ తన అన్న మ్ల్లయ మోకాలుకు తాకగా మరిన్ని బుల్లెట్లు అదే గ్రామానికి చెందిన సంఘం సభ్యులు రేషపల్లి కొండయ్య, రేషపల్లి లక్ష్మీనర్సయ్య తలభాగంలో తాకాయి. గూండాలు నశించాలి, తుపాకులు మమ్మల్ని ఏమీ చేయలేవంటూ నినాదాలు చేశారు. కొమురయ్య అక్కడికక్కడే మృతి చెందగా వీరుడిగా ప్రపంచ చరిత్రలో వీరుడిగా చిరస్థాయిగా నిలిచాడు.
ఉద్యమానికి ఊపిరిపోసిన కొమురయ్య అమరత్వం…..
దొడ్డి కొమురయ్య అమరత్వం తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరిపోసింది. కొమురయ్య మరణంతో జానమ్మ దొరసాని వ్యవసాయ పనికి గానీ, ఇంటి పనికి గానీ, ఎవరూ పోవద్దని ఆంధ్రమహసభ పిలుపునివ్వడంతో ఆనాడే సహయనిరాకరణ మొదలైంది. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి కూడా ఎవరూ పనికి రావద్దని సంఘపోళ్లు అనడంతో దొరసాని వ్యవసాయం పడావుపడింది. దీంతో జానమ్మ తిరిగి విస్నూరు వెళ్లిపోయింది. ఆ తర్వత సంఘ కార్యక్రమాలు ఉదృతమై మరో పోరాటానికి నాంది పలికాయి.
నేడు కడవెండికి కమ్యూనిస్టు పార్టీల అగ్రనాయకుల రాక…
నేడు కడవెండి గ్రామానికి పలు కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు రానున్నట్లు మండల సిపిఐ కార్యదర్శి జీడి ఎల్లయ్య తెలిపారు. నేటి 72వ దొడ్డి కొమురయ్య వర్దంతి మహాసభకు అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజవంతం చేయాలని కోరారు.

Comments

comments