Home జాతీయ వార్తలు సాగర తీరంలో అద్భుత విన్యాసాలు

సాగర తీరంలో అద్భుత విన్యాసాలు

తుది ఘట్టానికి అంతర్జాతీయ
నౌకాదళ ప్రదర్శన

vizagవిశాఖపట్నం: విశాఖపట్నంలో జరుగుతున్న అంతర్జా తీయ నౌకా దళ ప్రదర్శన చివరి ఘట్టానికి చేరుకుంది. ఆదివారం సెలవుదినం కావటంతో ఈ విన్యాసాలను తిలకించేందుకు ప్రజలు భారీఎత్తున బీచ్‌కి వచ్చారు. నౌకా విన్యాసాల్లో జాతీయ, అంతర్జాతీయ యుద్ధ నౌక లను ప్రదర్శిస్తున్నారు. మిగ్-29 విమానాల విన్యాసాలు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ప్రదర్శ లను ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంక య్యనాయుడు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబునాయుడుతో పాటు పలువురు ప్రముఖులు వీక్షించారు. ప్రత్యేక గ్యాల రీలో ఆశీనులైన ప్రధాని మోదీకి విన్యాసాల నౌకదళ అధికారులు గురించి వివరించారు. ఈ విన్యాసాలను చూసేందుకు 1.40లక్షల మంది పాస్‌లను పొందారు. మరో 17వేల మందికిపైగావిఐపి పాస్‌లు పొందారు. విన్యాసాలను నేరుగా చూడలేని వారికి పట్టణంలోని 50 థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శన ఏర్పాటు చేశారు. కాగా విశాఖలో జరుగుతున్న అంతర్జాతీయ నౌకా విన్యా సాలను వీక్షించేందుకు సందర్శకులు బారులు తీరారు. దీంతో నగరంలో పలుచోట్ల రద్దీ నెలకొంది. పలుచోట్ల వాహనాలు నిలిచిపోయాయి.
కళ్లు చెదిరే సాహసాలు…
విశాఖపట్నంలో 11 అంతర్జాతీయ యుద్ధనౌకల సమీ క్షలో నౌకాదళాలు అద్భుతమైన విన్యాసాలు, కళ్లు చెదిరే సాహసాలతో ఆకట్టుకున్నాయి. యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాప్టర్లు గగన తలంలో జాతీయ జెండాను రెపరెపలాడిస్తుండగా, చిన్న బోట్‌లు, లాంచీలు, యుద్ధ నౌకలు విశాఖ తీరంలో దూసుకెళ్లాయి. తీరం వెంబడి నావికాదళ సాహసాలు కూడా ఆకట్టుకున్నాయి. ఇండి యన్ నేవీలో ముఖ్యంగా విక్రమాదిత్య ఆకట్టుకుంది. ఈ సాహస విన్యాసాలను విశాఖ పౌరులే కాకుండా, దేశ విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులు కన్నార్పకుండా వీక్షించారు.
నౌకా దళాలు సహకరించుకోవాలి: పారికర్
పరస్పర కోసం అన్ని దేశాల అంతర్జాతీయ నౌకా దళాలు పరస్పరం సహకరించుకోవాలని రక్షణమంత్రి మనోహర్ పారికర్ కోరారు. విశాఖలో అంతర్జాతీయ నౌకా సదస్సుకు పారికర్ హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ అన్ని దేశాలు పరస్పర సమా చార పంపిణీ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి నౌకాదళాలు కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఒకే ర్యాంకు ఒకే పింఛ నుకోసం ప్రభుత్వం రూ.7,400 కోట్లు ఖర్చు చేస్తోంద న్నారు. సియాచిన్‌లో మంచు చరియలు విరిగిపడి సైని కులు మృతిచెందటం దురదృష్టకరమన్నారు. పాకిస్థా న్‌తో ప్రస్తుతానికి స్నేహసంబంధాలు బాగానే ఉన్నాయని పారికర్ అన్నారు. దేశాల ఆర్థిక వ్యవస్థను సముద్రాలు ప్రభావితం చేస్తున్నాయన్నారు. మత్స్య సంపదతో పాటు ఖనిజాలు, చమురు వంటి విలువైన సంపదను సము ద్రాలు అందిస్తున్నాయని ఆయన తెలిపారు. అటువంటి వాటి రక్షణ బాధ్యతను అన్ని దేశాల నౌకాదళాలు సమ ష్టిగా చేపట్టాలని పారికర్ కోరారు. గ్లోబల్ వార్మింగ్ కార ణంగా సముద్ర మట్టాలు బాగా తగ్గుతున్నాయని దీనిని నివారించాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. అక్ష య్‌కుమార్, కంగనా రనౌత్ ఐఎఫ్ ఆర్ అంబాసిడర్లుగా ఒప్పందం కుదుర్చుకోలేదని పారికర్ స్పష్టం చేశారు.

ప్రజల స్ఫూర్తి అభినందనీయం: మోడీ
విశాఖ ప్రజల స్ఫూర్తి అభినందనీయమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అంతర్జాతీయ నౌకాదళ ప్రద ర్శన సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ నగ రమంటే తనకు ఎంతో ఇష్టమని, హుద్‌హుద్ విల యం సంభవించినప్పుడు విశాఖకు వచ్చానన్నారు. ఇక్కడి ప్రజలు 14నెలల్లోనే ధైర్యంగా తేరుకున్నారని ప్రశంసించారు. ఫ్లీట్ రివ్యూను అద్భుతంగా నిర్వహిం చిన నౌకాదళానికి మోడీ అభినందనలు తెలిపారు.
అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబా బును ప్రధాని మోడీ అభినందించారు. తీర ప్రాంత దేశాలతో ఆర్థిక, వాణిజ్య సంబంధాల బలోపేతానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతాయని, సముద్రాల ద్వారా విలువైన వాణిజ్యం జరుగుతోం దని ప్రధాని తెలిపారు. అన్ని దేశాల నౌకాదళాలు సమష్టి భద్రతపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.