Home తాజా వార్తలు ప్రధాన రహదారులపై స్పీడ్ లేజర్ గన్‌లు…

ప్రధాన రహదారులపై స్పీడ్ లేజర్ గన్‌లు…

speed-laser-gunsవనపర్తి క్రైం: వాహనదారులు నిర్దేశించిన వేగాన్ని అతిక్రమిస్తే రూ.1400 జరిమానా విధిం చనున్నట్లు ఎస్‌పి అపూర్వారావు తెలిపారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఏకో పార్కులో లేజర్ గన్‌ను ఎస్‌పి అపూర్వారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌పి అపూర్వారావు మాట్లాడుతూ 44వ జాతీయ రహదారిపై ,రాష్ట్ర రహదారులపై స్పీడ్ గన్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రమాదాల నివారణ కోసం స్పీడ్‌గన్‌లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

వేగాన్ని నిరోధించేందుకు వాహన దారు లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని తెలిపారు. వేగాన్ని అతిక్రమిస్తే రూ. 1400 జరిమానా విధిస్తామన్నారు. అధునాతన టెక్నాలజీతో తయారు చేయడం జరిగిందన్నారు. ఆటోమేటిక్ సిస్టం ద్వారా వాహనం వేగాన్ని కనిపెడతామన్నారు. స్పీడ్ లేజర్ గన్ విలువ రూ. 9 లక్షల 50 వేలు విలువ ఉంటుందని పేర్కొన్నారు. పోలీసులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

Speed Laser Guns on Main Roads in Wanaparthy