Home జాతీయ వార్తలు భారత ఆకాశయానంలో కొత్త మైలురాయి

భారత ఆకాశయానంలో కొత్త మైలురాయి

విమానాలకు జట్రో ఫా మొక్కల ఇంధనం

aeroplane

జట్రోఫా(అడవి ఆముదం) మొక్కల విత్తనాలను ఇంధనంగా మార్చి జెట్ విమానాల ఇంజన్లను నడిపించడంలో 20 మంది శాస్త్రవేత్తల బృందం ఎనిమిదేళ్ల ప్రయత్నం ఫలించింది. డెహ్రా డూన్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపి) కేంపస్‌లో ఆగష్టు 27న తమ ప్రయోగాన్ని ప్రదర్శించారు. 40 శాతం చమురు పదార్థాలు కలిగిన జట్రోఫా నుంచి 330 కిలోల జీవ ఇంధనం (జెట్ ప్యూయెల్)ను తయారు చేయగలిగారు. ఇదే ఇంధనంతో డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ వరకు 45 నిమిషాల సేపు జెట్‌విమానాన్ని గగనంలో నడపగలిగారు. జట్రోఫా నుంచి ఈ మేరకు చమురును సేకరించడానికి ఐఐపి బృందానికి నాలుగు రోజులు పట్టిం ది.

విమానంలో కుడివైపున ఇంజన్‌కు దీన్ని ఉపయోగించారు. ఈ ప్రయోగాత్మక విమానంలో 25 శాతం మాత్రమే బయోజెట్ ఇం ధనం వినియోగించగా మిగతాది సంప్రదాయ విమాన టర్బయిన్ ఇంధనం, (ఎటిఎఫ్), అంతర్జాతీయ ప్రమాణాల ప్రమాణాల ప్రకారం ప్రతి ఇంజన్‌లో 50  శాతం వరకు బయోజెట్ ఇం ధనం వాడవచ్చు. 400 రకాల మొక్కల విత్తనాల నుంచి జీవ ఇంధనం  లభిస్తుంది. అయితే చత్తీస్‌గడ్ బయోప్యూయెల్ డెవలప్‌మెంట్ అధారిటీ నుంచి జట్రోపా వెంటనే లభిస్తున్నందున శాస్త్రవేత్తలు ఇం ధనం తయారీకి జట్రోఫాన్ ఎం చుకున్నారు. మా వోయిస్టుల ప్రభావిత గ్రామాల్లో దాదాపు 500మంది వ్యవసాయ దారు లు ఈ జట్రోఫాను పండిస్తున్నారు. దీంతో ఆ రైతుల జీవితాల్లో చెప్పుకోదగిన మార్పువచ్చిందని సిఎస్‌ఐఆర్ ఐఐడి డైర్‌క్టర్ డాక్టర్ అంబన్ రాయ్ చెప్పారు. విమానాల్లో సాధారణంగా కిరోసిన్ ఆధారిత ఇంధనాలను వినియోగిస్తుంటారు. ఇవి కాలుష్య వ్యాప్తి కారకాలు. అయితే ఇటువంటి ఇంధనాలను విమానాలు ఉపయోగించడం తో విమాన సర్వీస్‌ల వల్ల వా తావరణంలో 4.9 శాతం వరకు మా ర్పు కనిపిస్తోందని ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లయిమేట్ చేంజ్ (ఐపిసిసి), వరల్డ్ మెటియెరోలాజీ ఆర్గనైజేషన్ (డబ్లూఎమ్‌డిఓ) అభిప్రాయ పడుతున్నా యి. ఎటువంటి హైడ్రోకార్బన్ ఇంధనమైనా ట న్ను, ఇంధనం మండితే 3.15 టన్నుల కార్బన్‌డయాక్సయిడ్‌ను ఉత్పత్తి చేస్తాయి.

అదే మొక్క నుంచి వచ్చే ఇ ంధనం అయితే కార్బన్ ఉద్గారాలు విడుదలయిన వాటికీ, వాతావరణం నుంచి మొక్కలు గ్రహించే కార్బన్‌కు సమానంగా ఉంటాయి. వంద శాతం  బయోజెట్ ఇంధనాన్ని విమానాల్లో వినియోగిస్తే  కార్బన్ ముద్ర 50 నుంచి 80 శాతం వరకు తగ్గుతుంది. ఇంధనం నిల్వ, సరఫరా, ఉ త్పత్తి ప్రక్రియ బట్టి ఇది ఆధారపడి ఉంటుందని రాయ్ పే ర్కొన్నారు. మరో ప్రయోజనం ఏమంటే వాయుకాలుష్యం తగ్గుదల, సంప్రదాయ విమాన ఇంధ నం మిలియన్‌కు 3000 పార్టుల సల్ఫర్ ఉంటుంది. దాని నుంచి సల్ఫ ర్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. అదే బయోజెట్ ఇం ధనం అయితే మిలియన్‌కు 10 పార్టుల కన్నా తక్కువే సల్ఫర్ ఉంటుంది. వంటగ్యాస్ ఇంధనాన్ని కూడా బయో ఇంధనంగా మార్చి విమానాలకు, ఆటోమొబైల్ వాహనాలకు వినియోగించాలని చూస్తున్నారు. వంటకు ఉపయోగించే చమురు నుంచి 850 నుంచి 950 ఎంఎల్ వరకు బయోడీజిలు లభిస్తుంది. భారతదేశ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అధారిటీ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) జులై1 నుంచి వం ట చమురును తిను బండరాల తయారీకి మళ్లీ మళ్లీ వాడడాన్ని నిషేధిస్తూ కొన్ని ప్రమాణాలు విధించింది. దీనికి బదులు బమో ఇంధనాన్ని వాడాలని ప్రోత్సహిస్తోంది. దేశంలో ఏటా 23 మిలియన్ టన్నుల వంట చమురు వినియోగమవుతోంది.

దేశంలో జెడ్ వి మానాల ఇంధనానికి 6నుంచి 7 మిలియన్ టన్నుల వర కు డిమాండ్ ఉంది. అందులో సగానికి సగం బయోజెట్ ఇంధనంతో సాంకేతికంగా భర్తీ చేయవచ్చు. ఈ సగంలో మూడోవంతు ఉపయోగించిన వంట చమురు నుంచి సేకరించవచ్చునని రాయ్ చెప్పారు. జీవ ఇంధనం వల్ల అనేక ప్రయోజనాలు ఉ న్నప్పుడు కార్లు, విమానాలకు ఇంకా ఎందుకు పెట్రోలు, కిరోసిన్ వాడవలసి వస్తోంది? అన్న ప్రశ్న రాక తప్పదు, పారిశ్రామిక స్థాయిలో ఈ జీవ ఇం ధనం తయారీకి ఎం తో వ్యయం జరుగుతుంది. అంతేకాక కొన్ని శ్రమలు పడ క తప్పదు. సంప్రదాయ ఇంధనం కన్నా జీవ ఇంధనం తయారీకి 60 నుంచి 70  ఖర్చు ఎక్కువ పెట్టవలసి వస్తు ంది.    మనతెలంగాణ/  విభాగం