Search
Sunday 23 September 2018
  • :
  • :

మొలకెత్తే విత్తనాలలో..

Sproutవిత్తనాలను మొలకెత్తించి వాడటం వల్ల మన ఆరోగ్య పోషణకు  దోహదచేస్తాయి. వీటిని మన ఆహారంలో కలిపి తీసుకోవాలి. విత్తనాన్ని మొలకెత్తిస్తే దానిలోని ఎంజైములు చైతన్యవంతమై ఎన్నో మార్పులను తీసుకువచ్చి గింజలోని పోషకాలు మన శరీరానికి సులభంగా లభ్యమయ్యే రూపంలోకి మార్చటమే గాక కొన్ని పోషకాలను సృష్టిస్తాయి. మన ఆహారంలో సాధారణంగా వాడే ధాన్యాలు, పప్పులను, మొలకెత్తిస్తే వాటిలోని పోషక విలువలు  ఎక్కువగా వుంటాయి. పప్పులు, ధాన్యలలో మాంసకృత్తులు వుంటాయి. మొలకెత్తినప్పుడు నీటిలోని మాంసకృత్తులలో మార్పువచ్చి నాణ్యత పెరుగుతుంది. మాంసకృత్తులు అమైనో ఆమ్లాలుగా విభజంచబడి అత్యవసర ఆమైనో ఆమ్లాల నిష్పత్తిలో ఉపయోగకరమైన మార్పు వస్తుంది. ఈ విధంగా మాంసకృత్తులు శరీరంలో సులభంగా జీర్ణమై శరీర పోషణకు తోడ్పడతాయి.

Comments

comments