Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

క్రిష్ డైరెక్షన్‌లో స్పై థ్రిల్లర్

varun-tejవిభిన్న కథా చిత్రాలు చేస్తూ టాలీవుడ్‌లో యంగ్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు వరుణ్‌తేజ్. శ్రీకాంత్ అడ్డాల ‘ముకుంద’తో తెరంగేట్రం చేసిన అతను ‘కంచె’ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. తాజాగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో చేసిన ‘లోఫర్’ చిత్రంతో సూపర్‌హిట్‌ను అందుకున్నాడు. ఇక ప్రపంచ యుద్ధం నేపథ్యంలో వరుణ్‌తో ‘కంచె’ చిత్రాన్ని  చేసిన క్రిష్ ప్రస్తుతం అతనితో అడ్వెంచర్ థ్రిల్లర్‌ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. టాలీవుడ్‌లో తొలిసారిగా క్రిష్ స్పై థ్రిల్లర్‌ను రూపొందించబోతున్నాడు. గతంలో జేమ్స్ బాండ్ తరహా సినిమాలు కొన్ని వచ్చినా తెలుగులో స్పై థ్రిల్లర్‌లు మాత్రం ఇంతవరకు రాలేదు. కానీ క్రిష్ తొలిసారిగా డిఫరెంట్ స్టోరీతో ఓ అడ్వెంచర్ థ్రిల్లర్‌ను వరుణ్‌తేజ్‌తో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ‘రాయబారి’ టైటిల్‌తో ఈ సినిమా రానుంది. వరుణ్ టైటిల్ రోల్‌లో నటిస్తాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కే ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లనుంది.

Comments

comments