Search
Wednesday 21 November 2018
  • :
  • :

వర్మ డైరెక్షన్‌లో సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్?

Balaiahఒకప్పుడు సంచలన దర్శకుడిగా రామ్‌గోపాల్‌వర్మ ఎన్నో హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. అయితే ఈమధ్య తన స్థాయికి తగ్గట్టుగా సరైన సినిమాలను అతను చేయలేకపోతున్నాడు. ఇటీవల అమితాబ్‌తో వర్మ చేసిన  ‘సర్కార్ 3’ పర్వాలేదనిపించింది. ఇప్పుడు రామ్‌గోపాల్‌వర్మకు ఓ మెగా ఆఫర్ వచ్చిందని అంటున్నారు. లెజండరీ నటుడు, గొప్ప రాజకీయ నటుడైన సీనియర్ ఎన్టీఆర్ జీవితంపై ఒక సినిమా చేయాలనే టాపిక్ ఎప్పటినుంచో వినిపిస్తూనే ఉంది. అయితే  బాలకృష్ణను హీరోగా పెట్టి ఈ సినిమా చేస్తే ఎలా ఉంటుందని ఎవరూ ఆలోచించి ఉండరు. ఈమధ్యనే రామ్‌గోపాల్‌వర్మకు ఎన్టీఆర్ జీవిత గాథతో సినిమా తీయొచ్చనే సూపర్బ్ ఐడియా వచ్చిందట. వెంటనే పూరి జగన్నాథ్ ద్వారా ఈ విషయాన్ని బాలకృష్ణకు చెప్పడంతో ఆయన కూడా ఓకే అన్నాడట.  ఈ సినిమాను సైమా అవార్డులను నిర్వహించే విష్ణు ఇందూరి ప్రొడ్యూస్ చేయనున్నాడనే టాక్ వినిపించింది. ఇకపోతే ఎన్టీఆర్ కథను సినిమాగా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తారు. అలాగే ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తే అది ఇంకా హైలైట్‌గా ఉంటుంది. అయితే ఎన్టీఆర్ బయోపిక్‌కు రామ్‌గోపాల్‌వర్మ పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాడా అనే ప్రశ్నలు అప్పుడే టాలీవుడ్‌లో మొదలయ్యాయి.

Comments

comments