Home కరీంనగర్ హుజూరాబాద్‌కు శ్రీమంత్రిడు..!

హుజూరాబాద్‌కు శ్రీమంత్రిడు..!

sreenivasan-to-hujurabad

కనీవీని ఎరుగని స్థాయిలో అభివృద్ధి పనులు
నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా చేసేందుకు తాపత్రయం
రూ.1500 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు
పదిహేను రోజులకొక సారి పనుల పర్యవేక్షణ
అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గం

‘నా బాధ్యతగా హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలి. అందుకోసం ఆహర్నిశలు కష్టపడటమే నా ధ్యేయం. నా శ రీరంలోని చివరి రక్తపు బొట్టు వరకు రాష్ట్రాభివృద్ధికే పాటుపడుతా. ఓట్ల కోసమో, సీట్ల కోసమో తెలంగాణను సాధించ లేదు. తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రతి నిమిషం పాటుపడ్డాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనని ఆంధ్ర నాయకులంటే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆసూయ పడుతున్నా అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.’  కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్ నియోజకవర్గానికే ఒక ప్రత్యేకత ఉంది. జమ్మికుంట, వీణవంక, కమలాపూర్ మండలాలతో ఉండగా జిల్లాల పునర్విభజన అనంతరం కమలాపూర్ మండలం వరంగల్ అర్భన్ జిల్లా పరిధిలోకి వెళ్లిపోగా కొత్తగా జమ్మికుంట మండలంలోని ఇల్లందకుంటను నూతన మండలంగా ఏర్పాటు కావడంతో కమలాపూర్ స్థానంలో కొత్తగా వచ్చి చేరింది.నియోజకవర్గ జనాభా సుమారు 2 లక్షల పై చిలుకే ఉంటుంది. హుజూరాబాద్, జమ్మికుంటలను ట్విన్ సీటీలుగా పేర్కొనడం అనవాయితీగా కొనసాగుతుంది.రూ. 1500 కోట్ల నిధులతో నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులను శ్రీకారం చుట్టి ప్రగతి పథంలో దూసుకెళ్తుంది.

మనతెలంగాణ/హుజూరాబాద్:

 నేరవేరనున్న సొంతింటి కళ :
ఇళ్లు లేని నిరుపేద ప్రజలకు సొంతంటిని నిర్మించాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూం పథకానికి శ్రీకారం చుట్టారు.ఇందులో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా జమ్మికుంట, హుజూరాబాద్, వీణవంక,ఇల్లందకుంట మండలాల్లో శరవేగంగా ఇంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇళ్ల కోసం రూ. 500 కోట్ల నిధులను మంత్రి ఈటలరాజేందర్ కేటాయించడం అభినందనీయం.ఇప్పటికే పలు చోట్ల ఇళ్ల నిర్మాణాలు తుది దశకు చేరుకోగా పలు చోట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. డిసెంబర్ చివరి కల్లా నిర్మాణాలు పూర్తి నిరుపేద ప్రజలకు ఇళ్లను అప్పగించేందుకు మంత్రి ఈటల రాజేందర్ ఉన్నతాధికారులకు దిశ నిర్దేశం చేస్తున్నారు. ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేతే నిరుపేద ప్రజల సొంతింటి కళను మంత్రి ఈటల రాజేందర్ తీర్చినవారవుతారు.

చిరు వ్యాపారుల కోసం షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు :
పట్టణంలోని చిరు వ్యాపారులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ప్రజలకు శాశ్వత నిర్మాణాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో మున్సిపల్ కార్యాలయ సమీపంలో, సైదాపూర్ రోడ్‌లలో ఈటల రాజేందర్ పేరిటా మున్సిపల్ పాలకవర్గం షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సుమారు రూ.50 కోట్ల నిధులతో రెండు అంతస్తులలో వీటిని నిర్మించి లబ్దిదారులకు అందజేశారు.

కూరగాయాల వ్యాపారులకు హ్యకర్స్ జోన్ ఏర్పాటు :
వివిధ గ్రామాల నుంచి కూరగాయాలను విక్రయించుకునేందుకు పట్టణానికి రోజుకు సుమారు 100 నుంచి 150 మంది కూరగాయాల వ్యాపారులు వస్తుంటారు. కూరగాయాలను విక్రయించుకునేందుకు స్థలం లేకపోవడంతో కూరగాయాలను రోడ్డుపై పెట్టి విక్రయించి కాలం గడుపుతున్నారు. ఈ సమస్యను పరిష్కారించాలనే ఉద్దేశ్యంతో మంత్రి ఈటల రాజేందర్ ఆదేశానుసారంగా సుమారు రూ.50 లక్షలతో నిధులతో హ్యకర్స్ జోన్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతంలో ఇందులో నిర్మాణ పనులు పూర్తయిన తరువాత కూరగాయాల వ్యాపారులకు అప్పగించేందుకు మున్సిపల్ పాలకవర్గం కసరత్తులు చేస్తోంది. దీన్ని ఆదర్శంగా ప్రజల రద్దీని బట్టి ఆయా చోట్ల హ్యకర్స్ జోన్‌ను ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ పాలకవర్గం భావిస్తుంది.

వేగంగా మీని ట్యాంక్ నిర్మాణ పనులు :
హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లో మీని ట్యాంక్ బండ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా హుజూరాబాద్ పట్టణంలోని మోడల్ చెరువును మీని ట్యాంక్ బండ్‌గా మార్చేందుకు సుమారు రూ.20 కోట్ల నిధులను మంత్రి ఈటల రాజేందర్ కేటాయించారు. సిద్దిపేట జిల్లాలోని కోమటి బండ చెరువు నిర్మాణ పనుల మాదిరిగానే హుజూరాబాద్‌లో కూడా అలానే తయారు చేయాలని అధికారులకు మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు.ఇప్పటికే చెరువు కట్ట నిర్మాణ పనులు పూర్తి కాగా సెంట్రల్ లైటింగ్, గ్రీనరీ, బెంచీలను ఏర్పాట్లు చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు.జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మాద్ ఆయాశాఖల అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేశారు. మీని ట్యాంక్ బండ్ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని సూచించారు. పట్టణ ప్రజలకు సాయంత్రం వేళ ఆహ్లాదపరచాలని ట్యాంక్ బండ్ పనులకు శ్రీకారం చుట్టారు.

తీరనున్న ప్రయాణీకుల కష్టాలు :
నియోజకవర్గంలోని ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో మంత్రి ఈటల రాజేందర్ సుమారు రూ.800 కోట్ల నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నిర్మాణాలతో పాటు గ్రామాలను పట్టణాలను కలుపుతూ ప్రధాన రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. హుజూరాబాద్ నుంచి జమ్మికుంటకు రూ. 60 కోట్ల నిధులతో నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులతో పాటు పరకాల నుంచి హుజూరాబాద్‌కు నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులకు రూ.120 కోట్ల నిధులను కేటాయించారు. అంతేకాకుండా జమ్మికుంట నుంచి వీణవంకకు, జమ్మికుంట నుంచి ఇల్లందకుంట మండలాలకు లింకు రోడ్డు నిర్మాణ పనులు కూడా పూర్తి కావచ్చాయి. దీంతో ప్రజలక మెరుగైన రవాణా సదుపాయం అందుబాటులోకి రానుంది.

కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం :
హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాలకు సమీపంలో ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలనే ఉద్దేశ్యంతో వంద పడకల ఆసుపత్రులనిర్మాణానికి మంత్రి ఈటల రాజేందర్ శ్రీకారం చుట్టారు.ఇందులో భాగంగా హుజూరాబాద్‌లో రూ.15 కోట్ల నిధులతో వందపడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయింది. త్వరలోనే దీన్నిప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ ఆసుపత్రిలో అన్ని రకాల సేవలందించేందుకు మంత్రి ఈటలరాజేందర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి నష్టపోతున్న ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు మంత్రి ఈటల రాజేందర్ అహార్నీషులు పాటుపడుతున్నారు

ఆధునిక హంగులతో సశ్మాన వాటిక :
హుజూరాబాద్‌లో అద్దె ఇంట్లో ఉండి ఆకస్మాతుగా మరణించిన వారి దహాన సంస్కారాలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి రాగా వెంటనే చిలుక వాగు సమీపంలో రూ.2 కోట్ల నిధులతో ఆధునిక హంగులతో స్మశాన వాటికను ప్రారంభించారు.రాష్ట్రంలో ఏ నియోకవర్గంలో లేని విధంగా దీన్ని ముస్తాబు చేశారు. సుమారు రెండు ఎకరాల సువిశాల ప్రదేశంలో దీన్ని నిర్మించి ఇవ్వడంతో ప్రజలు కష్టాలు గట్టెక్కాయి.

నిరుపే విద్యార్థులకు గురుకుల పాఠశాలల ఏర్పాటు :
వివిధ వర్గాలకు చెందిన నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో మైనార్టీ, బీసీ, సాంఘీక గురుకుల పాఠశాలల ఏర్పాటుకు మంత్రి ఈటలరాజేందర్ కృషి చేశారు.హుజూరాబాద్,జమ్మికుంటలలో ఏర్పాటు చేసిన మైనార్టీ గురుకుల పాఠశాలలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది.అంతేకాకుండా బీసీ, సాంఘీక గురుకుల పాఠశాలలో కూడా అడ్మిషన్‌లు భారీగా జరుగుతున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై రూ. లక్ష 13 వేల నగదును ఖర్చు చేస్తుండటం విశేషం. . రానున్న ఎన్నికల్లో సైతం మంత్రి ఈటలరాజేందర్‌కే ప్రజలు ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

నియోజకవర్గఅభివృద్ది పాటుపడుతున్నా మంత్రి ఈటల :
– ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్, హుజూరాబాద్
నియోజకవర్గ సర్వతోముఖాభివృద్దికి మంత్రి ఈటల రాజేందర్ అహ ర్నీషులు పాటుపడుతున్నారు.సుమారు రూ. 1500 కోట్ల నిధులతో వివిధ గ్రామాల్లో శరవేగంగా పూర్తవుతున్నాయి. గ్రామాల్లో మట్టి రోడ్డు లేకుండా చూడటమే మంత్రి ఈటల రాజేందర్ లక్షమని పేర్కొన్నారు.ప్రజలకు తాగునీటి కష్టాలు రాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.

మంత్రి సహకారంతో పట్టణ సుందీరకరణ పనులు ప్రారంభం :
– వడ్లూరి విజయ్‌కుమార్, మున్సిపల్ చైర్మన్, హుజూరాబాద్
హుజూరాబాద్ మున్సిపాలీటీ అభివృద్దికి మంత్రి ఈటల రాజేందర్ పెద్ద ఎత్తున నిధులను కేటాయించారు. ఆ నిధులతో అంబేద్కర్ చౌరస్తా వద్ద సుందరీకరణ పనులు చేపట్టడంతో పాటుగా డివైడర్ల ఏర్పాట్లు చేసి మధ్యలో గ్రీనరి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నాం. అలాగే మున్సిపల్ కార్యాలయం ఎదుట చిన్నారుల కోసం పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నాం.