Search
Friday 21 September 2018
  • :
  • :

పల్లెకెలె టెస్టు: శ్రీలంక 135 ఆలౌట్

Team-India

పల్లెకెలె: వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ ఆతిథ్య జట్టు 135 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా 352 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. భారత బౌలర్ల ధాటికి లంకేయులు వరుసగా పెవిలియన్ కు క్యూకట్టారు.లంక బ్యాట్స్ మెన్లలో ఉపుల్ తరంగా(5), కరుణరత్నే(4), కుశాల్ మెండిస్(18), చండీమల్(48), డిక్వెల్లా(29),  పుష్పకుమార(10), సందకన్(10) పరుగులు చేయగా… మాథ్యూస్, పెరీరా, ఫెర్నాడో, లహీరు కుమార డకౌట్ గా వెనుదిరిగారు.

దీంతో లంక జట్టు 135 పరుగల స్పల్వ స్కోర్ కే ఆలౌట్ అయింది. అంతకుముందు టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 487 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. దీంతో భారత్ కు  352 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు, షమీ, అశ్వీన్ తలో 2 వికెట్లు, హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీశారు.

Sri Lanka all out on 135 runs in First Innings in Pallekele Test.

Comments

comments