Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

బాల్ ట్యాంపరింగ్ వివాదం.. శ్రీలంక కెప్టెన్ సస్పెండ్

srilanka
దుబాయి: వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా బాల్ ట్యాంపరింగ్‌కి పాల్పడినందుకు శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండీమాల్, కోచ్ చంద్రికా హతురుసింగే, మేనేజర్ అసంకా గురుసిన్హలపై ఐసిసి సస్పెన్షన్ వేటువేసింది. క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించిన ఈ ముగ్గురిని సౌతాఫ్రికాతో జరిగే తొలి నాలుగు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌ల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఐసిసి ప్రకటించింది. స్వతంత్ర జ్యూడీషియల్ కమీషనర్ మైఖేల్ బెలాఫ్ క్యూసీ ఈ కేసును విచారించి వీరికి ఎనిమిది సస్పెన్షన్ పాయింట్లు విధించారు. గత నెల జూన్ 19న వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో చండీమాల్ బాల్ పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తూ కెమెరాకు చిక్కాడు. బంతికి ఏదో పదార్ధాన్ని రుద్దుతూ కెమెరాకు  దొరికిపోయాడు. దీనికి సంబంధించిన ఆడియోని ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్‌‌సన్, ఐసిసి కోడ్‌ కమీషన్‌తో కలిసి విన్నారు.  ఈ సమావేశం అనంతరం చండీమాల్, చంద్రికా, అసంకా ఆర్టికల్ 2.3.1 ప్రకారం లెవల్ 3ని ఉల్లంఘించినట్లు డేవిడ్ రిచర్డ్‌‌సన్ పేర్కొన్నారు.

Comments

comments