Home అంతర్జాతీయ వార్తలు రాజపక్షని ప్రధానిగా గుర్తించను

రాజపక్షని ప్రధానిగా గుర్తించను

Sri Lanka parliament speaker refuses to recognise

కొలంబో :  రణిల్ విక్రమసింఘేని తొలగించడం, పార్లమెంట్‌ని సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలని శ్రీలంక స్పీకర్ కరు జయసూర్య అన్నారు. అధ్యక్షుడు మైత్రిపాల సిరసేన తీసుకున్న నిర్ణయాన్ని తాను అంగీకరించనని చెప్పారు. రాజపక్షని ప్రధానమంత్రిగా గుర్తించనని, పార్లమెంట్‌లో ఆయన బలపరీక్షలో నెగ్గితేనే గుర్తిస్తానని స్పష్టం చేశారు. పార్లమెంట్ నవంబర్ 14న సమావేశమవుతుందని, గతంలో  చెప్పిన దాని కంటే ఒక వారం ఆలస్యంగా సమావేశం జరుగుతుందని అధ్యక్షుడు సిరిసేన ప్రకటించారు. ఈ ప్రకటనపై స్పీకర్ ఘాటుగా స్పందించారు. నవంబర్ 7 న పార్లమెంట్ సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అత్యధిక పార్లమెంట్ సభ్యులు తనకు ఇచ్చిన పిటిషన్‌లో అధ్యక్షుడు సిరిసేన రాజ్యాంగ విరుద్ధంగా మార్పులు చేశారని తెలిపారని స్పీకర్ చెప్పారు. పార్లమెంట్ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తన స్థానాన్ని ప్రపంచం ముందుంచుతున్నానని జయసూర్య తెలిపారు.

కొత్తగా నియమింపబడిన ప్రధానమంత్రి రాజపక్ష బల నిరూపణ చేసుకునే వరకు యథాతద స్థితిని కొనసాగిస్తానని ఆయన చెప్పారు. రాజపక్షకు పార్లమెంట్‌లో ప్రధానమంత్రి సీటు ఇవ్వనని, ప్రస్తుత ప్రభుత్వ సభ్యులు ప్రతిపక్ష స్థానంలోనే కూర్చోవాలని ఆయ న స్పష్టం చేశారు. అక్టోబర్ 26న ప్రధానమంత్రి విక్రమసింఘేని తొలగించి, ఆయ న స్థానంలో వివాదస్పదమైన మాజీ ఆథ్యక్షుడు రాజపక్షని సిరిసేన నియమించారు. నవంబర్ 7 న పార్లమెంట్ సమావేశమవుతుందని జయసూర్య భావిస్తుండగా నవంబర్ 14న పార్లమెంట్ సమావేశమవుతుందని సిరిసేన నోటీసు జారీ చేశారు. పార్లమెంట్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం త్వ రగా సమసిపోవాలని తాను కోరుకున్నానని స్పీకర్ జయసూర్య తెలిపారు. పార్లమెంట్‌ని సమావేపరచాలని జయసూర్యని అనేక పౌరసంఘాలు డిమాండ్ చేశాయి. అయి తే అధ్యక్షుడి అనుమతి లేకుండా పార్లమెంట్‌ని సమావేశపరిచే అధికారం తనకు లేదని చెప్పారు. నవంబర్ 14న పార్లమెంట్ సమావేశం కావడాన్ని  తాము అంగీకరించమని,  ఎంపీలను కొనే అవకాశముందని, దీనిని ప్రజలు వ్యతిరేకించాలని విక్రమసింఘే యునైటెడ్ నేషనల్ పార్టీ సీనియర్ నేత వజీరా అబేయ్‌వర్దన అన్నారు.

Sri Lanka parliament speaker refuses to recognise

Telangana News