Home తాజా వార్తలు తిరుమలకు చేరుకున్న శ్రీలంక ప్రధాని…

తిరుమలకు చేరుకున్న శ్రీలంక ప్రధాని…

Sri Lanka Prime Minister reached Tirumala

తిరుమల: తిరుమల పర్యటన నిమిత్తం శ్రీలంక ప్రధాన మంత్రి రాణిల్ విక్రమ్ సింఘే దంపతులు గురువారం తిరుమలకు చేరుకున్నారు. టిటిడి ఇఒ అనిల్ కుమార్ సింఘాల్, జెఇవొ శ్రీనివాసరాజు శ్రీకృష్ణ వీరికి  ఘనస్వాగతం పలికారు. శ్రీకృష్ణ అతిథి గృహంలో బసచేసి శుక్రవారం ఉదయం స్వామి వారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుమల నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం నుంచి  భారత వైమానిక దళ ప్రత్యేక హెలికాఫ్టర్ లో చెన్నైకి బయల్దేరనున్నారు.