Search
Sunday 19 August 2018
  • :
  • :
Latest News

లంకకు ఓ గెలుపు

sri lanka test win in south africa

నాలుగో వన్డేలో 3 పరుగుల తేడాతో సఫారీల ఓటమి

కాండీ: హ్యాట్రిక్ ఓటముల అనంతరం శ్రీలంక ఎట్టకేలకో గెలుపు దక్కింది. దక్షిణాఫ్రికాతో బుధవారం ఇక్కడ జరిగిన డే అండ్ నైట్ నాలుగో వన్డేలో ఆ జట్టు డక్‌వర్త్ లుయీస్ నియమం ప్రకారం 3 పరుగులతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక క్రికెటర్లు షనక (34 బంతుల్లో 65; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్‌తో 39 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు డికెవెలా (34), తరంగ (36) శుభారంభం అందించగా,కుశాల్ పెరీరా (32 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిసారా పెరీరా (45 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో రాణించారు. లంక ఇన్నింగ్స్ 9వ ఓవర్లో ఉండగా వర్షం కారణంగా అరగంటపైగా ఆట నిలిచిపోవడంతో మ్యాచ్‌ను 39 ఓవర్లకు కుదించారు.

ఛేదనలో సఫారీ ఇన్నింగ్స్ రెండు ఓవర్లు కాగానే మరోసారి వర్షం గంటపైగా ఆటంకం కలిగించింది. దీంతో లక్ష్యాన్ని 21 ఓవర్లలో 191 పరుగులుగా నిర్దేశించారు. దక్షిణాఫ్రికా 21 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసి ఓడింది. ఓపెనర్లు డికాక్ (13 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్), ఆమ్లా (23 బంతుల్లో 40; 6 ఫోర్లు) జోరుతో దక్షిణాఫ్రికా దీటుగానే ఆరంభించింది. డుమిని (23 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా జోరు చూపడంతో విజయం తేలికేననిపించింది. కానీ లంక బౌలర్లు వరుసగా క్లాసెన్ (17), హెండ్రిక్స్(2), ఫెలూక్వాయో(9)లను పెవిలి యన్‌కు పంపారు. ఓ ఎండ్‌లో మిల్లర్ (21) నిలిచినా ఫలితం లేకపోయింది. చివరి ఓవర్‌లో సఫారీలు గెలవాలంటే 8 పరుగులు అవసరం కాగా, లక్మల్ (3/ 46) మిల్లర్‌ను ఔట్ చేయడంతో పాటు నాలుగే పరుగులు ఇచ్చి లంకను గెలిపించాడు.

స్కోరు కార్డు

శ్రీలంక ఇన్నింగ్స్: 306/7(39 ఓవర్లు): నిరోషన్ డిక్‌వెల్ల(సి)డికాక్(ఇ)డుమిని 34, ఉపుల్ తరంగ(బి)విల్లెం ముల్డర్ 36, కుసల్ మెండీస్-ఎల్‌బిడబ్లు(బి)మహరాజ్ 14, కుసల్ పెరీరా(సి) మిల్లర్(బి) డుమిని 51, ఏంజెలో మాథ్యుస్(సి) డికాక్(బి) లుంగీ గిడీ 22, ధనంజయ డి సిల్వా(సి) జూనియర్ డల(బి) లుంగి గిడీ 10, థిసారా పెరెరా(నాటౌట్)51, డసున్ షనక(సి) విల్లెం ముల్డర్(బి) ఫెహ్‌ల్కువాయో 65, అకిల ధనంజయ(నాటౌట్) 1. ఎక్స్‌ట్రాలు: 306

వికెట్ల పతనం: 161,292,3100, 4159, 5183, 6195, 7304.

బౌలింగ్: లుంగి గిడీ 80652, జూనియర్ డల 80640, అండిలె ఫెహలుక్‌వాయో 60451,జీన్‌పౌల్ డుమిని 60352, విల్లెం ముల్డర్ 60511, కేశవ్ మహరాజ్ 50371.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: 187/9(21 ఓవర్లు): క్వింటన్ డికాక్(బి)లక్మల్ 23, హషీం ఆమ్లా(సి)లాహిరు కుమార(బి)ధనంజయ 40, రీజా హెండ్రిక్స్(సి)ధనంజయ డిసిల్వా(బి)షనక 2, జీన్ పౌల్ డుమిని(రనౌట్)షనక 38, హీన్‌రిచ్ క్లాసెన్ (సి)మాథ్యుస్(బి)ధనంజయ డిసిల్వా 17, డేవిడ్ మిల్లర్(బి)లక్మల్ 21, ఆండిలె ఫెహ్‌లుక్‌వాయో(బి)థిసార పెరీరా 9, విల్లెం ముల్డర్ (సి)ధనంజయ డి సిల్వా(బి)లక్మల్ 4, కేశవ్ మహరాజ్ (బి)థిసార పెరీరా 17, జూనియర్ డల(నాటౌట్) 3, లుంగి గిడీ(నాటౌట్) 1. ఎక్స్‌ట్రాలు: 12. వికెట్ల పతనం: 134, 251, 3108, 4129, 5130, 6149, 7155, 8183, 9183.
బౌలింగ్: సురంగ లక్మల్ 50463, అకిల ధనంజయ 30301, థిసార పెరీరా 40322, డసన్ షనక 20201, లాహిరు కుమార 30280, ధనంజయ డి సిల్వా 40261.

Comments

comments