Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

శ్రీలంక క్లీన్‌స్వీప్

srilanka

కొలంబో: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆతిథ్య శ్రీలంక జట్టు 20తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇక్కడ జరిగిన రెండో, చి వరి టెస్టులో శ్రీలంక 199 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. తొలి మ్యాచ్‌లోనూ శ్రీ లంక ఘన విజయం సాధించిన విషయం తెలిసిం దే. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ శ్రీలంక బౌలర్లు అసాధారణ బౌలింగ్ కనబరిచారు. 139/5 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం నాలుగో రోజు బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికాకు డిబ్రుయెన్, బావుమా అండగా నిలిచారు. ఇద్దరు లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముం దుకు సాగారు. వీరిని ఔట్ చేసేందుకు లంక బౌల ర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. డిబ్రుయెన్, బావుమా అద్భుత పోరాట ప టిమను కనబరుస్తూ ముందుకు సాగారు. కీలక బ్యాటింగ్‌తో లంక బౌలర్లను ముప్పుతిప్పలు పె ట్టారు. ఇదే క్రమంలో ఆరో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని కూడా నమోదు చేశారు. అయితే 98 బంతుల్లో 4 ఫోర్లతో 61 పరుగులు చేసిన బావుమాను హెరాత్ వెనక్కి పంపాడు. తర్వాత సౌతాఫ్రికా వరుసగా వికెట్లను కోల్పోయింది. రంగన హెరాత్ అసాధారణ బౌలింగ్‌తో సఫారీ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చాడు. మరోవైపు చిరస్మరణీ య పోరాటాన్ని కొనసాగించిన డిబ్రుయెన్ 232 బంతుల్లో 12 ఫోర్లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. లంక బౌలర్లలో హెరాత్ ఆరు వికెట్లు ప డగొట్టాడు. అఖిల ధనంజయ, పెరీరాలకు రెండేసి వికెట్లు దక్కాయి.

Comments

comments