Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

మాటలు మర్యాదగా రావాలి: శ్రీరెడ్డి

Sri Reddy Fires On Tollywood Women Producers

హైదరాబాద్: టాలీవుడ్ కు చెందిన ఓ మహిళపై శ్రీరెడ్డి తీవ్ర మండిపడ్డారు. టాలీవుడ్ లో కొన్ని నెలల కిందట కలకలం రేపిన డ్రగ్స్ కేసుతో పాటు వ్యభిచారం లాంటి విషయాల గురించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె  పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేడం ఓ మహిళగా మిమ్మిల్ని గౌరవిస్తాను. ఆ గౌరవాన్ని మీరు కాపాడుకొండి. నిర్మాతగా మూవీలు చేశారు. మీకు మా సమస్యలు తెలియవు. మాటలు మర్యాదగా రాకపోతే నేను తట్టుకోలేను. మీ ఇష్టం వచ్చినట్లు పిచ్చి పిచ్చిగా మాటలు మట్లాడితే పడేవారు ఇక్కడ ఎవరు లేరు. కో ఆర్డినేటర్స్ ఎంత దారుణంగా ప్రవర్తిస్తారో మీకు తెలుసా అని ఆమెను ప్రశ్నించింది. మహిళలను అలాంటి వాటిలోకి ఎలా దింపుతారో తెలుసు. సినిమా ఇండస్ట్రీకి నర్త్ ఇండియన్ అమ్మాయిలను పరిచయం చేసి, ఇంట్లో ఉంచుకున్న ఆ కల్చర్ తెచ్చింది మీరే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో మంచి హోదాలో ఉన్నా మీరు ఇలా ప్రవర్తించడం ఏం బాగలేదు. తెలుగు ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయాలని కోరుతూ నటి శ్రీరెడ్డి వీడియో పోస్ట్ చేశారు.

Comments

comments