Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదు: శ్రీరెడ్డి

Sree-reddy-press-meet

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఎత్తున క్యాస్టింగ్ కౌచ్ పై  పోరాటం చేస్తానని సినీనటి శ్రీరెడ్డి స్పష్టం చేసింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన తదుపరి కార్యచరణపై ఆమె స్పందించింది. ఈ సందర్భంగా శ్రీరెడ్డి మాట్లాడుతూ… వాస్తవాలను వక్రీకరించిన వారు ఎంత పెద్దవారైనా వదిలే ప్రసక్తే లేదని తెలిపింది.  మహిళల్లో తెగింపు వస్తే ఏవిధంగా స్పందిస్తారో తెలుస్తుందని, తానెవరికీ భయపడనని చెప్పింది. తన యూట్యూబ్ ఖాతాలో ఉన్నవీడియోలపై విమర్శలు గప్పించిన ప్రతి ఒక్కరిపై న్యాయపోరాటం చేయనున్నట్టు పేర్కొంది. గోపాలకృష్ణ కళనిధి, రచనారెడ్డితో పాటు మరో ఇద్దరు న్యాయవాదులు తన తరుపున వాదించనున్నట్టు తెలిపింది. తెలుగు ఇండస్ట్రీని నాలుగు కుటుంబాలే పెత్తనం కొనసాగిస్తున్నాయని, క్యాష్ కమిటీలోనూ మళ్లీ ఆ నాలుగు కుటుంబాలకు చెందినవారినే ఎలా నియమిస్తారని ఆమె ప్రశ్నించింది. కొందరు పెద్దలు తనకు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించారని, కానీ ఇంత వరకు తాను ఎవరి దగ్గరి నుంచి డబ్బు తీసుకోలేదని వెల్లడించింది. ఇటీవల కాలంలో మీడియా ముందుకు వచ్చిన పెద్దలు హుందాగా మాట్లాడాల్సింది పోయి బెదిరించే విధంగా మాట్లాడారని, ఆ బెదిరింపులకు తాను భయపడనని శ్రీశక్తి స్పష్టం చేసింది. తాను ఏమీ ఆశించి ఉద్యమం చేయడం లేదని, పరిశ్రమలోని మహిళల సమస్యలపై పోరాటం చేయాడమే తన లక్ష్యమని తెలిపింది.  క్యాస్టింగ్  కౌచ్ పై అతి త్వరలో సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేస్తమని, అన్ని రాష్ట్రాల డిజిపిలు, హోంశాఖ, కేంద్ర ప్రభుత్వాన్ని పార్టీలుగా చేర్చనున్నట్టు శ్రీ రెడ్డి తరుపు న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి వెల్లడించారు.

Comments

comments