Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

మెగా హీరో నుంచి బెదిరింపు కాల్: శ్రీరెడ్డి

Sri-Reddy, Sri Reddy's New Tweet On Casting Couch in Tollywood

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్న నటి శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరలేపింది. ఇటీవల టాలీవుడ్ అగ్రనటుడు, జనసేనాని పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటన తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఆమె ఆరోపించింది. ముఖ్యంగా మెగా బ్రదర్ హీరో నాగబాబు తనకు కాల్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆమె ట్వీట్ చేసింది. ‘నాకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో నాగబాబు దగ్గర నుంచి… నాకు ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత మెగా ఫ్యామిలీదే. ఇది స్వయంగా నా స్వహస్తాలతో రాస్తున్న నా వాంగ్మూలం’ అంటూ శ్రీరెడ్డి ట్వీట్‌లో పేర్కొంది.

Comments

comments