Home తాజా వార్తలు భద్రాచలంలో ఘనంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం

భద్రాచలంలో ఘనంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం

Sri Seetharamula Kalyanamభద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలంలోని శ్రీకోదండ రామాలయంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా జరుగుతోంది. సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. ప్రభుత్వం తరుపున సీతారాములకు పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమర్పించారు. శోభాయమానంగా మిథిల ప్రాంగణం ముస్తాబైంది. భక్తుల కోసం ఆలయ అధికారులు 3 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. 34 ప్రత్యేక కౌంటర్లలో రాముల వారి తలంబ్రాల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. సీతాదేవికి యోత్రబంధనం, శ్రీరాముడికి యజ్ఞోపవీతధారణను అర్చకులు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.

Sri Seetharamula Kalyanam in Bhadrachalam