Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

టాలీవుడ్ బ్యూటీ తమన్నాకు ‘శ్రీదేవి’ అవార్డు

tamanna-sideviహైదరాబాద్: టాలీవుడ్ బ్యూటీ తమన్నా దివంగత నటి శ్రీదేవి అవార్డును అందుకోనున్నారు. ఈ అవార్డును ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించనున్న’అప్సర అవార్డ్’ కార్యక్రమంలో తమన్నాకు అందఙేయనున్నారు. ఈ విషయాన్ని తమన్నా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సందర్భంగా తమన్నా శ్రీదేవి పేరుతో ఉన్న అవార్డును అందుకుంటున్నందుకు సంతోషంగా ఉంది అన్నారు. శ్రీదేవి లాగే తను కూడా చిన్న వయసులోనే చిత్ర పరిశ్రమలోకి వచ్చాను అని అన్నారు. 1983లో శ్రీదేవి నటించిన ‘హిమ్మత్‌వాలా’ సినిమాను 2013 లో రీమేక్ చేశారు.  ఇందులో తమన్నా శ్రీదేవి పాత్రలో నటించారు.

Comments

comments