Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

శ్రీకాంత్ ఓటమి

Srikanth defeat in badminton tournament

టోక్యో: జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్ పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్ పి.వి.సింధు, పురుషుల విభాగంలో కిదాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్.ప్రణయ్‌లు ఓటమి పాలయ్యారు. ఇంతకుముందే పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్, మహిళల డబుల్స్‌లలో భారత్ ఓటమి పాలైంది. తాజాగా శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత అగ్రశ్రేణి ఆటగాడు శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 21-19, 16-21, 18-21 తేడాతో కొరియా క్రీడాకారుడు లీ డాంగ్ క్యూన్ చేతిలో కంగుతిన్నాడు. ర్యాంకింగ్స్‌లో తనకంటే ఎం తో తక్కువ స్థానంలో ఉన్న డాంగ్ చేతిలో శ్రీకాంత్ అనూహ్య ఓటమి చవిచూశాడు. తొలి సెట్‌లో భార త స్టార్ ఆధిపత్యం చెలాయించాడు. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ ముందుకు సాగాడు. ఇదే క్రమంలో సెట్‌ను గెలిచి పైచేయి సాధించాడు. అయితే తర్వాతి రెండు సెట్లలో వరుస ఓటములు చవిచూడడంతో శ్రీకాంత్ టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు. ఈ సీజన్‌లో శ్రీకాంత్ ఒక్క టైటిల్ కూడా సాధించలేదు. కిందటిసారి నాలుగు టైటిల్స్ గెలిచి ప్రకంపనలు సృష్టించాడు.

Comments

comments