Search
Monday 24 September 2018
  • :
  • :

శ్రీకాంత్ ఔట్

కశ్యప్, సింధు, సైనా ముందుకు, ఇండియా ఓపెన్

Badminton

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ ఓపెన్‌లో భారత్‌కు కోలుకోలేని షాక్ తగిలింది. అగ్రశ్రేణి ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ రెండో రౌండ్‌లోనే ఇంటిదా రి పట్టాడు. ఇప్పటికే అజయ్ జయరాం, హెచ్‌ఎస్. ప్రణయ్‌లు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన విష యం తెలిసిందే. తాజాగా వీరి సరసన శ్రీకాంత్ కూ డా చేరాడు. మరోవైపు సమీర్ వర్మ, పారుపల్లి కశ్య ప్ రెండో రౌండ్‌లో విజయం సాధించారు. మహిళల సింగిల్స్‌లో అగ్రశ్రేణి క్రీడాకారిణిలు పివి.సింధు, సైనా నెహ్వాల్‌లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. స్పెయిన్ స్టార్ కారొలైన్ మారిన్, థాయిలాండ్ అగ్రశ్రేణి క్రీడాకారిణి ఇంటానొన్ మూడో రౌండ్‌కు చేరుకున్నారు. కాగా, పురుషుల సింగిల్స్‌లో తెలుగు తేజం శ్రీకాంత్‌కు ఊహించని షాక్ తగిలింది. మలేసియా ఆటగాడు ఇస్కాందర్ జుల్కర్‌నైన్ చేతిలో శ్రీకాంత్ కంగుతిన్నాడు. సొంత గడ్డపై శ్రీకాంత్ టైటిల్ గెలవడం ఖాయమని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. హోరాహోరీగా సాగిన సమరంలో ఇస్కాందర్ 2119, 2117 తేడాతో శ్రీకాంత్‌ను ఓడించాడు. ప్రారంభం నుంచే మలేసియా ఆటగాడు దూకుడైన ఆటతో పైచేయి సాధించాడు. మరోవైపు తీవ్ర ఒత్తిడికి గురైన శ్రీకాంత్ ఏదశలోనూ ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించలేక పోయాడు. అంతేగాక కీలక సమయంలో వరుస తప్పిదాలకు పాల్పడడంతో ఓటమి తప్పలేదు.

సమీర్ ఉత్కంఠ గెలుపు..

మరోవైపు సమీర్ వర్మ హోరాహోరీ పోరులో విజయం సాధించాడు. ఇండోనేసియాకు చెందిన సుగియార్టొతో జరిగిన పోరులోసమీర్ చెమటోడ్చి విజయం సాధించాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో సౌరభ్ 2118, 1921, 2117 తేడాతో జయకేతనం ఎగుర వేశాడు. మరో పోటీలో కశ్యప్ కూడా చెమటోడ్చాడు. హోరాహోరీగా సాగిన పోరులో కశ్యప్ 1921, 2119, 2112 తేడాతో భారత్‌కే చెందిన జైస్వాల్‌పై విజయం సాధించాడు. తొలి గేమ్‌లో ఓటమి పాలైన కశ్యప్ తర్వాత వరుసగా రెండు సెట్లు గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. మరో పోటీలో గుల్షన్ కుమార్ (భారత్) ఓటమి పాలయ్యాడు. మహిళల సింగిల్స్‌లో సింధు అలవోక విజయాన్ని అందుకుంది. బల్గేరియా క్రీడాకారిణి లిండా జెట్చిరితో జరిగిన మ్యాచ్‌లో సింధు 2110, 2114తో విజయం సాధించింది. మరో పోటీలో మారిన్ (స్పెయిన్) చెమటోడ్చి విజయం సాధించింది. మూడో సెట్ల సమరంలో మారిన్ చైనా క్రీడాకారిణి ఫాంగ్‌జి గావోను ఓడించింది. కాగా, భారత్‌కు చెందిన అరుషి కశ్యప్ రెండో రౌండ్‌లో ఓటమి పాలైంది. మరోవైపు అగ్రశ్రేణి క్రీడాకారిణి సైనా రెండో రౌండ్‌లో సునాయాస విజయం సాధించింది. డెన్మార్క్ క్రీడాకారిణి లినెతో జరిగిన పోరులో సైనా 2112 2111తో జయభేరి మోగించింది.

Comments

comments