Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

‘ మెంటల్ పోలీస్’కు బ్రేక్

Mental-Policeహైదరాబాద్: శ్రీకాంత్ ప్రధాన పాత్ర పోషించిన ‘ మెంటల్ పోలీస్’ చిత్రాన్ని విడుదల చేయకూడదని హైకోర్టు సోమవారం తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రం విడుదలకు రెండు వారాల పాటు స్టే విధిస్తూ సెన్సార్‌బోర్డ్ అధికారులకు కోర్టు నోటీసులు ఇచ్చింది. పిటీషనర్ సమర్పించే వినతి పత్రాన్ని పరిగణలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యాజ్యంలో ఎపి హోం శాఖ ముఖ్యకార్యదర్శి, సెన్సార్‌బోర్డ్ ప్రాంతీయ అధికారి, మెంటల్ పోలీస్ నిర్మాత, డైరెక్టర్‌లకు నోటీసులు ఇచ్చింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ రాంచంద్రరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సినిమా టైటిల్ పోలీసుల అనోభావాలను దెబ్బతీసేలా ఉందని నెల్లూరు జిల్లా పోలీసు అధికారుల సంఘం గౌరవ అధ్యక్షుడు శ్రీహరిబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Comments

comments