Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

దుమ్ముదులిపిన దిల్షాన్.. ఆఫ్ఘనిస్థాన్‌పై లంక గెలుపు…

srilanka-won-the-match-ijmaకోల్‌కతా : వరల్డ్ కప్ టీ-20 శ్రీలంక బోణి కొట్టింది. ఆఫ్ఘనిస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ దిల్షాన్ 83(నాటౌట్ 56 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో ఒంటరి పోరాటం చేసి లంకకు విజయాన్ని అందించాడు. 154 పరుగుల విజయలక్షంతో బరిలోకి దిగిన లంక 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్షాన్ని చేధించింది. ఓపెనర్లు చండీమల్, దిల్షాన్ శుభారంభాన్ని ఇచ్చారు. 41 పరుగుల వద్ద చండీమల్ ఔట్ అవ్వగా వచ్చిన తిరిమన్నె వెంటనే ఔట్ అయ్యాడు. వేగంగా పరుగులు చేయాలనే లక్షంతో దూకుడు ప్రదర్శించిన బ్యాట్స్‌మెన్స్ పేరీరా, కపుగెదరా వరుస రనౌట్లతో నిరాశ పరిచారు. వరుస వికెట్లు కోల్పోతున్నా దిల్షాన్ దూకుడుగా ఆడి టీంకు విజయాన్ని అందించాడు.

Comments

comments