Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

‘శ్రీమంతుడు’కు తొలిరోజు 30 కోట్లు!

Mahesh Babuమహేష్‌బాబు, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్రీమంతుడు’. మైత్రి మూవీ మేకర్స్, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. బ్యానర్స్‌పై రూపొందిన ఈ సినిమా ప్రపంచవాప్తంగా విడుదలై మంచి సక్సెస్ టాక్‌తో దూసుకెళ్తోంది. వరల్డ్‌వైడ్‌గా 30 కోట్ల రూపాయల షేర్‌ను సంపాదించుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ “సినిమా యునానిమస్ టాక్‌తో పెద్ద హిట్ అయింది. సినిమా అనుకున్న దానికంటే పెద్ద సక్సెస్ అయ్యింది. ఇటువంటి మంచి సినిమాను చేయడానికి సహకరించినందుకు మహేష్‌బాబుకు థాంక్స్‌”అని అన్నారు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని మాట్లాడుతూ “మా బ్యానర్‌లో వచ్చిన మొదటి సినిమా ‘శ్రీమంతుడు’ ఇంత పెద్ద హిట్ కావడం ఎంతో ఆనందంగా ఉంది. అభిమానులు, ప్రేక్షకులు పైరసీని ప్రోత్సహించవద్దు. సినిమా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతూ మంచి కలెక్షన్స్ వస్తున్నాయి”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి రవిశంకర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments