Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

హీరోయిన్‌గా రాబోతున్న శ్రీముఖి

srimukiఈమధ్యన బుల్లి తెర యాంకర్లు వెండి తెరపై మెరుపులు మెరిపిస్తున్నారు. హాట్ యాంకర్లు రేష్మి, అనసూయలు సినిమాల్లో కథానాయిక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు మరో అందమైన యాంకర్ శ్రీముఖి హీరోయిన్‌గా ఓ సినిమా చేయనుంది. ఆమె ఇంతవరకు పలు సినిమాల్లో చిన్న రోల్స్ చేసింది. కానీ ఈసారి కథానాయికగా శ్రీముఖి ప్రేక్షకుల ముందుకు రానుంది. బుల్లితెరపై యాంకర్‌గా పలు కార్యక్రమాల్లో దర్శనమిస్తూ అలరిస్తున్న ఆమె… రచయిత, నటుడు హర్షవర్ధన్ చిత్రంలో కథానాయికగా నటించబోతోంది. లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కే ఈ చిత్రంలో శ్రీముఖి హీరోయిన్‌గా చేయనుంది. తమిళ నటుడు కిషోర్ హీరోగా చేయనున్నాడు. టైటిల్ నిర్ణయించని ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.

Comments

comments