Search
Monday 12 November 2018
  • :
  • :
Latest News

శ్రీనివాస కళ్యాణం టీజర్ విడుదల…

Srinivasa Kalyanam Teaser Released in Hyderabad

హైదరాబాద్: నితిన్ కు జోడీగా రాశీ ఖన్నా నటిస్తున్న చిత్రం శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రంలో నందితా శ్వేత కీలక పాత్ర పోషిస్తున్నారు. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తుండగా, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ సినిమా టీజర్ ను విడుదల ఛేశారు. ఈ టీజర్ లో “ఏం అబ్బాయిలకే అమ్మాయిలు ముద్దొస్తారా.. మాకు రారా.. “అని అంటున్నారు కథానాయిక రాశీ ఖన్నా. ఈ చిత్రంలో నితిన్‌,రాశీ ఖన్నా ప్రేమకథను అందంగా చూపించారు. సాయంత్రం నాకు మీ టైం ఓ రెండు గంటలు అప్పుగా ఇవ్వాలి అని నితిన్ అంటే‌.. ఈ టైమ్‌ అప్పు ఏంటి.. అని రాశీ అన్నారు. దీనికి నితిన్ మీ టైం మీది అది నాకు ఇవ్వాలంటే మరి అప్పుగానే ఇవ్వాలిగా అంటూ వివరించడం జరుగుతుంది.

 

Comments

comments