Home తాజా వార్తలు రైతులకు శ్రీరామ రక్ష

రైతులకు శ్రీరామ రక్ష

Sriram Sagar project Water Level Increases To 1090 Feet

పూర్తిస్థాయికి మూడడుగుల చేరువగా శ్రీరామ్‌సాగర్ నీటిమట్టం
పూర్తిస్థాయి 1090 అడుగులు
బుధవారం నాటి మట్టం 1087

మన తెలంగాణ/ నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరువలో ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1090 అడుగులు కాగా, బుధవారం నాటికి 1087 అడుగులకు చేరుకుంది. మరో మూడడుగుల వరదనీరు చేరితే సాగర్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆయకట్టు రైతాంగానికి మేలు చేసేలా కాకతీయ, లక్ష్మి, సరస్వతి కాలువల ద్వారా అధికారులు స్వల్పంగా నీటిని వదులుతున్నారు. బుధవారం ఇన్‌ఫ్ల్లో 64వేలకు పడిపోగా వరద నీరు స్థిరంగా వస్తోంది. అనుకోని పరిస్థితిలో ఇన్‌ఫ్లో పెరిగినప్పటికీ ప్రాజెక్టుకు ఇబ్బంది కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.ఇప్పటికే ప్రాజెక్టుకు విష్ణుపురి, గైక్వాడ్‌తో పాటు మరికొన్ని ప్రాజెక్టుల నుండి వరదనీరు వస్తుండగా మహరాష్ట్రలో మరికొ న్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తే అవకాశం ఉన్నట్లు నీటి పారుదల శాఖ అధికారులకు సమాచారం అందింది. మొత్తానికి గత సంవత్సరం సరిపడా నీరు లేక బోసిపోయిన శ్రీరాంసాగర్ ఈ యేడు రైతుల్లో ఆనందాన్ని నింపింది.