మెండోరా ః ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయినటువంటి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ నీటిమట్టం రోజురోజుకు పెరుగుతూ జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడం, రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు చేరడంతో శనివారం ప్రాజెక్టులోకి 6160 క్యూసెక్కుల ఇన్‌ప్లో వచ్చి చేరుతుందని, అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం 1091 అడుగులు 90 టిఎంసిలకు శనివారం సాయంత్రం నాటికి 1058.50 అడుగులు 11.946 టిఎంసిలుగా ఉందని ప్రాజెక్టు ఏఈ మహేంధర్ తెలిపారు.ఇది ఇలా ఉండగా ప్రాజెక్టు నుండి 194 క్యూసెక్కుల నీరు దిగువ గోదావరిలోనికి విడుదల అవుతుందన్నారు. గత ఏడాది ఇదే రోజున ప్రాజెక్టు నీటి మట్టం 1091 అడుగులు 9. టిఎంసిలకు 1055.10 అడుగులు 9.361 టిఎంసిలుగా ఉంది. రాబోయే రోజుల్లో ఎగువ ప్రాంతాల్లో ఇలాగే భారీగా వర్షాలు కురిస్తే తమ పంటలకు ఎటువంటి డోకా ఉండదని ఆయకట్టు రైతులు తమ ఆశభావాన్ని వ్యక్తం చేశారు.