Home తాజా వార్తలు శ్రీశైలం గేట్లు ఎత్తివేత

శ్రీశైలం గేట్లు ఎత్తివేత

Water flow to Srisailam project with heavy rainfall in Karnataka

మన తెలంగాణ/ హైదరాబాద్ : కర్నాటకలో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా నీటి ప్రవాహం వస్తోంది. దీంతో శనివారం నాడు ఏడు గేట్లను ఎత్తేశారు. దీంతో కృష్టమ్మ దిగువకు పరుగులు పెడుతోంది. శ్రీశైలం డ్యామ్‌లోకి ఎగువ నుండి 3,53,185 క్యూసెక్కుల నీరు రావడం తో 2,63,118 క్యూసెక్కులను దిగువకు విడుద ల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల జలాశయా ల నుంచి వరద శ్రీశైలానికి వస్తోంది. శ్రీశైలం రిజర్వాయర్ సామర్థం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 881.9 అడుగులకు చేరి, 198.36 టిఎంసిలుగా ఉంది. అలాగే కృష్ణబేసిన్ పరిధిలో ఆల్మట్టి 129.725 నీటి సామర్థం టిఎంసిలు కాగా, ప్రస్తుతం 124.2 టిఎంసికి నీరు చేరుకోవడంతో 1,42,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

నారాయణ్‌పూర్ ప్రాజెక్ట్ 36.48 టిఎంసికి నీటిమట్టం చేరి, 1,42,000 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. జూరాలప్రాజెక్ట్9.17 టిఎంసికి చేరి, 1,43,013 నీరు ప్రవహిస్తోంది. తుంగభద్ర 91.44టిఎంసికి నీరు చేరి, 1,43,013 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది.నాగార్జునడ్యామ్ 532 అడుగులకు, 172.27టిఎంసి నీటిమట్టం చేరి, 2,32,693 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. గోదావరి బేసిన్ పరిధిలో సింగూరుకు 818 క్యూసెక్కుల నీరు, కడెంకు 5066 క్యూసెక్కులనీరు, ఎల్లంపల్లికి 3,84,53 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2400 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్తు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 73,257 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.