Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ

Srisailam-Projectశ్రీశైలం: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరదనీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాజెక్టులన్నీ నిండటంతో ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వస్తుండటంతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటోంది. శ్రీశైలం జలాశయంలోకి ప్రస్తుతం 2,61,212 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. 16,732 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 835 అడుగులకు నీటిమట్టం చేరుకుంది.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీరు విడుదల కావడంతో దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు 16,732 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 6,824 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 505 అడుగులకు చేరుకుంది.

Comments

comments