Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

883 అడుగులకు చేరిన శ్రీశైలం రిజర్వాయర్

reservoirఅచ్చంపేట : శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచి 40వేల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. పాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885కి గాను సాయంత్రం 6 గంటలకు 883 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటినిల్వ పూర్తిస్థాయి సామర్థ్యం 215.8070 టిఎంసిలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 204.7889 టిఎంసిలుగా నమోదైంది. ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడుకు 6,500 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2025 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా ప్రాజెక్టులో రెండు జల విత్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువన నాగార్జునసాగర్‌కు 67,478 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి మొత్తం 76,003 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుంది.

Comments

comments