Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

వైభవంగా మహారథోత్సవం

SRIVARUతిరుమల : బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి మహా రథోత్సవం ఘనంగా జరిగింది. గరుడ వాహనసేవ తరువాత ఎక్కువ మంది భక్తులు ఈ రథోత్సవానికి తరలివస్తారు. ఈ క్రమంలో టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది. దేవేరులతో కలిసి సుందరంగా ముస్తాబైన మలయప్పస్వామి రథపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. వేలాది మంది భక్తులు గోవింద నామ స్మరణ చేస్తూ స్వామివారి రథాన్ని ముందుకు లాగారు. కళాకారుల నృత్యాలు, కోలాటాలు ఘనంగా నిర్వహించారు.

Comments

comments