Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ట్విట్టర్‌లో షారుఖ్, ప్రియాంకలే టాప్

twitఈమధ్యన సోషల్ మీడియా చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల ద్వారా సినీ సెలబ్రిటీలు తమ అభిమానులను పలకరిస్తున్నారు. వారితో ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది ట్విట్టర్‌లో ఎవరి గురించి ఎక్కువ మాట్లాడుకున్నారన్న విషయాన్ని పరిశీలిస్తే… ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. బాలీవుడ్ కండలవీరుడు, తరచూ వివాదాల్లో తలదూర్చే సల్మాన్‌ఖాన్‌ను కాదని… కింగ్‌ఖాన్ షారుఖ్ గురించి ట్విట్టర్‌లో ఎక్కువమంది మాట్లాడుకున్నారట. ఏడాది మొత్తంలో షారుఖ్ గురించి 36 శాతం మంది మాట్లాడుకుంటే… సల్మాన్ గురించి కేవలం 18 శాతం మందే మాట్లాడారట. హీరోల విషయాన్ని పక్కనపెట్టి హీరోయిన్‌ల విషయానికొస్తే బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లి సత్తా చాటుతున్న బేవాచ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించే ఎక్కువ మాటలు సాగాయట. ప్రియాంక గురించి 23 శాతం మంది మాట్లాడుకుంటే… ఆతర్వాత స్థానంలో యంగ్ బ్యూటీ అలియా భట్ నిలిచిందట. వీరి తర్వాత స్థానాల్లో దీపికా పదుకునే, అనుష్కశర్మ, శ్రద్ధా కపూర్, కాజోల్, జాక్వలిన్ ఫెర్నాండెజ్, పరిణితి చోప్రాలు నిలిచారు. గత ఏడాది తను నటించిన ‘దిల్‌హై ముష్కిల్’ సినిమాతో వార్తలో తరచుగా హల్‌చల్ చేసిన ఐశ్వర్యరాయ్ గురించి ట్విట్టర్‌లో పెద్దగా మాట్లాడుకోకపోవడం గమనార్హం.

Comments

comments