Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ఫ్యాషన్ సెన్స్ కొరవడింది

Shruti-Haasan-Pathఅందాల తారలు ఏదైనా పెద్ద ఫంక్షన్‌కు వెళ్తే ప్రత్యేకంగా ఫ్యాషనబుల్ డ్రెస్సులో హాజరై కనువిందుచేస్తుంటారు. కానీ గతంలో ఒకరు ధరించిన డ్రెస్సును పోలిన డ్రెస్సును మరొకరు ధరించడం మాత్రం అరుదుగా జరుగుతుంటుంది. ఈవిధంగా శృతిహాసన్ విషయంలో పలుసార్లు జరిగింది. సైమా 2015 వేడుకలో శృతి… డిజైనర్ కోమల్ సూద్ గౌన్‌లో దర్శనమిచ్చి అందర్నీ ఆకట్టుకుంది. ఇక విషయానికొస్తే ఇలాంటి గౌన్‌ను దీక్షాసేథ్ తన సినిమా ‘లేకర్ హమ్ దీవానా దిల్’ ప్రీమియర్ సందర్భంగా ధరించడం విశేషం. ఇలా శృతిహాసన్ ఒకరు ధరించిన డ్రెస్సును పోలిన డ్రెస్సులను గతంలో ఒకటి,రెండు సార్లు కూడా వేసుకుందట.

ఇక గతంలో అలియాభట్ ధరించిన ఓ డ్రెస్సును పోలిన డ్రెస్సును సైమా 2013లో ఇలాగే శృతిహాసన్ ధరించిందట. ఓసారి సమంత హైదరాబాద్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌లో కట్టుకున్న చీరను పోలిన కలర్‌ఫుల్ చీరను శృతిహాసన్ ఓ సందర్భంలో ధరించిందట. ఇలా శృతి ఒకరు వేసుకున్న ఫ్యాషనబుల్ వస్త్రాలను పోలినవే ధరిస్తూ అందరి దృష్టిలో పడుతోంది. దీంతో శృతిహాసన్‌కు ఫ్యాషన్ సెన్స్ లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ పెద్ద వేడుకకు హాజరవుతున్నప్పుడు ధరించే వస్త్రాల విషయంలో శృతికి పెద్దగా పట్టింపులేకపోవడంతో ఇలా జరుగుతోంది.

Comments

comments