Search
Friday 16 November 2018
  • :
  • :

మద్యం మత్తులో తూలుతున్న యువత

Drunken-youth

ఖమ్మం ః ప్రముఖ పారిశ్రామిక పట్టణమైన పాల్వంచలో అల్లరిమూకల చిల్లర గొడవలు రోజు రోజుకు శృతి మించుతున్నాయి. కనీసం 16 యేళ్ళు కూడా నిండని వారు సైతం మద్యం సేవించి, ఆ మత్తులో ఊగిపోతు చిన్న చిన్న విషయాలకు కొట్టుకుంటూ పట్టణంలో ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారు. ఇలాంటి గొడవల్లో 16 నుండి 19 సంవత్సరాల వయసున్న యువకులు, ఆటోడ్రైవర్లు పాఠశాలలు, కళాశాలల వద్ద అడ్డాగా చేసుకొని పోకిరి మాటలతో అమ్మాయిలను వేధించడం పరిపాటి అయ్యింది. ఇటీవల రెజీనా కాన్వెంట్ స్కూల్ వద్ద వాచ్‌మెన్‌ను బెదిరించి ఇంటికెళుతున్న విద్యార్ధినిని తమ బండిపై ఎక్కాలని డిమాండ్ చేస్తుండగా పిల్లల తల్లిదండ్రులు వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇటీవల ఆటోలో వెళుతున్న అల్లరిమూకలు 5గురు ఒక కుర్రవాణ్ణి ఆటోతో అడ్డగించి కొట్టారు. అతిగా మద్యం సేవించి పెట్రోల్‌బంక్ ప్రాంతంలో 16,17 యేళ్ళ వయసున్న యువకులు రోడ్డుపై హల్‌చల్ చేయడం జరిగింది. దాడి జరుగుతున్న సమయంలో కొంతమంది చుట్టప్రక్కల వారు అక్కడికి చేరేసరికి ఆటోలో పారిపోయారు. ఇలాంటి సంఘటనలు పట్టణంలో దారి తప్పుతున్న యువకులకు సాక్షాలుగా ఉన్నాయి. ఇప్పటికైనా పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని పట్టణంలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Comments

comments