Home జాతీయ వార్తలు పళనిస్వామిపై సిబిఐ విచారణకు స్టాలిన్ డిమాండ్

పళనిస్వామిపై సిబిఐ విచారణకు స్టాలిన్ డిమాండ్

MK-Stalin

చెన్నయ్ : తమిళనాడు సిఎం పళనిస్వామి, ఇతర మంత్రులపై సిబిఐ విచారణ చేయించాలని డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ డిమాండ్ చేశారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు డబ్బు విచ్చలవిడిగా పంచిపెడుతున్నారన్న ఆరోపణలు రావడంతో ఈసీ ఆర్కేనగర్ ఉపఎన్నికను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్టాలిన్ అధికార పార్టీపై విరుచుకపడ్డారు. ఈ క్రమంలో సిఎం పళనిస్వామితో పాటు ఇతర మంత్రులపై సిబిఐ విచారణ చేయించాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.