Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

డిఎంకె అధ్యక్ష పదవికి స్టాలిన్ నామినేషన్

Stalin Nomination for DMK Presidential Post

చెన్నయ్ : డిఎంకె అధ్యక్ష పదవికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఆదివారం తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈనెల 28వ తేదీన జరిగే పార్టీ సర్వసభ్య సమావేశంలో డిఎంకె అధ్యక్షుడితో పాటు కోశాధికారిని ఎన్నుకుంటారు. డిఎంకె అధ్యక్షుడిగా ఉన్న తమిళనాడు మాజీ సిఎం కరుణానిధి ఇటీవల మృతి చెందాడు. దీంతో అధ్యక్ష పదవి ఖాళీ అయింది. అయితే పార్టీ అధ్యక్ష పదవికి స్టాలిన్‌తో పాటు ఆయన సోదరుడు అలగిరి పోటీ పడుతున్నాడు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలతో గతంలోనే అలగిరిను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. తాను అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నాని, డిఎంకె శ్రేణులు తన వెంటే ఉన్నాయని అలగిరి ఇటీవల ప్రకటించారు. దీంతో డిఎంకె అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందో వేచి చూడాలన్న అభిప్రాయం పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments